Dubai Princes Divorce: ఈ డివోర్స్ చాలా స్పెషల్... ఇన్ స్టాలో దుబాయ్ యువరాణి పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

dubai princes sheikha mahra divorce: దుబాయ్ కి చెందిన యువరాణి తన ఇన్ స్టాలో మరోసారి డివోర్స్ గురించి పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 10, 2024, 03:22 PM IST
  • విడాకుల మరో పోస్ట్ పెట్టిన దుబాయ్ రాణి..
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..
Dubai Princes Divorce: ఈ డివోర్స్ చాలా స్పెషల్... ఇన్ స్టాలో దుబాయ్ యువరాణి పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

dubai princess sheikha Mahra launches perfume divorce video: కొన్నిరోజులుగా ఎక్కడ చూసిన కూడా అనేక పెళ్లిళ్లు పెటాకులౌతున్నాయి. బాలీవుడ్, క్రీడా, రాజకీయం ఇలా ఎక్కడ చూసుకున్న కూడా అనేక విడాకుల  ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలల్లో గొడవలు వస్తుంటాయి. ఇద్దరు పెరిగిన వాతావరణం,మనుషులు వేర్వేరుగా ఉంటారు. అందుకే బేధాభిప్రాయాలు వస్తుంటాయి. కానీ.. పది, పదిహేను సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా.. ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న ఘటనలు వార్తలలో నిలిచాయి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @mahraxm1

 

తమిళనటుడు జయంరవి, తన భార్య ఆర్తితో విడిపొతున్నట్లు తాజాగా, ప్రకటించిన విషయం తెలసిందే. తెలుగులో నాగచైతన్య ..సమంత, పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక..ఇలా.. బాలీవుడ్.. హ్రుతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటివాళ్లు కూడా విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. అదే విధంగా.. దుబాయ్ రాణి ప్రస్తుతం తన డివోర్స్ పై ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..
 
యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు షేక్ మహ్రా. ప్రస్తుతం ఆమె తన ఇన్ స్టా వేదికగా మరోసారివిడాకులపై ఒక వీడియోను రిలీజ్ చేశారు. తన భర్తతో విడిపోతున్నట్లు గతంలోనే షేక్ మహ్రా వెల్లడించారు.  దుబాయ్ బిజినెస్ మెన్.. షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తో.. మే 27,2023 పెళ్లి జరిగింది.

కానీ అతనికి ఇతర మహిళలతో ఎఫైర్ లు ఉన్నట్లు షేక్ మెహ్రాకు తెలిసింది. దీంతో ఆమె.. ఈ ఏడాది జులై లో.. ఇన్ స్టా వేదికగా.. ప్రియమైన భర్తకు.. మీరు ఇతర మహిళల సాంగత్యం కోరుకుంటున్నారు.. అందుకు మీకు డైవర్స్ ఇస్తున్నా.. అంటూ పోస్టు చేశారు. మీ మాజీ భార్య అంటూ బాంబు పేల్చారు.

Read more: Ganesh Celebrations: వావ్.. డ్యాన్స్ చేస్తూ వెయిట్ లాస్.. స్ట్రెస్ కూడా మాయం.. దుమ్మురేపుతున్న వీడియో..

తాజాగా, ఆమె డైవర్సీసై ఒక పర్ ఫ్యూమ్ వీడియో సైతం విడుదల చేశారు. మహ్రా ఎమ్1 పేరుతో పర్ ఫ్యూమ్ బ్రాండ్ ను విడుదల చేశారు. దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. కానీ ఈ పోస్టుతో దుబాయ్ యువరాణి.. మరోసారి వార్తలలో నిలిచారు.
 

Trending News