భూమికి ఏమౌతుంది. అంతలా వేడెక్కిపోతుందా..ఎందుకు భూమాత వేడితో రగిలిపోతోంది. ఇదే కొనసాగితే ఏం జరుగుతుంది మరి.
భూగోళం ( Earth )పై వేడి పెరుగుతోందని చాలాకాలంగా శాస్త్రవేత్తలు చెబుతున్నదే. కానీ ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ ( East Anglia university )కు చెందిన వాతావరణ విభాగం చెబుతున్నది వింటే ఆందోళన కలుగుతుంది. గతంలో హాడ్‌క్రుట్ వేసిన అంచనా కంటే ఎక్కువగా అంటే 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీలు ఎక్కువగా వేడెక్కుతోందని ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ హెచ్చరిస్తోంది.
హాడ్‌క్రుట్ ( Hadcrut ) అనేది భూగోళపు ఉష్ణోగ్రత ( Global temperature ) డేటాను ఎప్పటికప్పుడు సేకరించి డేటాబేస్‌లో ఉంచే భూ వాతావరణ అంచనా ( Earth Warming )సంస్థ. 1850లో భూగోళం ఉష్ణోగ్రత కంటే..2010-18 నాటికి 1.90 ఫారిన్‌హీట్ డిగ్రీలు పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. కానీ అంతకంటే ఎక్కువగా 1.93 డిగ్రీలు పెరిగింది. భూమి వేడి గత 170 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం మనుష్యుల కారణంగా వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలేనని పరిశోధకులు తెలిపారు.
అయితే అమెరికాకు చెందిన నాసా ( NASA ), నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనాలు ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటి వరకూ ప్రతిసారీ హాడ్‌క్రుట్ అంచనాలు నిజం కాగా..ఈసారి 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీలు తేడా వచ్చింది. ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీ చాలా కచ్చితత్వంతో అంచనాలు వేసేందుకు ప్రయత్నిస్తోంది. Also read: Iran versus America: డోనాల్డ్ ట్రంప్ ఓ ఉగ్రవాది: ఇరాన్