Numerology Radix 7: న్యూమరాలజీలో 'ర్యాడిక్స్ 7' ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా.. ఈ ర్యాడిక్స్ కలిగినవారు చాలా లక్కీ

Numerology Radix 7:  న్యూమరాలజీ ప్రకారం 7 నెంబర్ చాలా శుభప్రదమైనది. ర్యాడిక్స్ 7 ఉన్న వ్యక్తులు చాలా ప్రత్యేకమని చెబుతారు. న్యూమరాలజీ ప్రకారం ఈ వ్యక్తుల స్థితిగతులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 02:09 PM IST
  • న్యూమరాలజీలో ర్యాడిక్స్ 7 ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా
  • ర్యాడిక్స్ 7 కలిగినవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి....
Numerology Radix 7: న్యూమరాలజీలో 'ర్యాడిక్స్ 7' ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా.. ఈ ర్యాడిక్స్ కలిగినవారు చాలా లక్కీ

Numerology Radix 7 : న్యూమారాలజీలో 7 నెంబర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడు నెంబర్‌ను అత్యంత పవిత్ర సంఖ్యగా పరిగణిస్తారు. శుభకార్యాల్లో ఏడు నెంబర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. న్యూమరాలజీ ప్రకారం... ఏదేని నెలలో 7, 16 లేదా 25 తేదీలలో జన్మించినవారికి ర్యాడిక్స్ '7'గా ఉంటుంది. పుట్టిన తేదీలోని అంకెలను కూడితే వచ్చేదే ర్యాడిక్స్.

ర్యాడిక్స్ 7 కలిగిన వ్యక్తులు అదృష్టవంతులు :

ర్యాడిక్స్ నెంబర్ 7 ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది. వారి కష్టానికి తగిన ఫలాలు వెంటనే లభిస్తాయి. ఆశించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు పొందుతారు. చేపట్టే ప్రతీ పనిలో సులువుగా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తుల ప్రత్యేకత ఏమిటంటే వారు కష్టపడటం, దూరదృష్టి వీరి నైజం. కష్టానికి ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ముందు చూపుతో భవిష్యత్తును అందంగా మలుచుకుంటారు.

ర్యాడిక్స్ 7 కలిగినవారు జ్ఞానవంతులు :

ర్యాడిక్స్ 7 వ్యక్తుల యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే.. వారు చాలా జ్ఞానవంతులు. అన్ని రంగాలపై వారికి అవగాహన, జ్ఞానం లభిస్తుంది. అలాగే, అతీంద్రియ విషయాల పట్ల  కూడా అవగాహన ఉంటుంది. వారు పనిచేసే ఫీల్డ్‌పై బలమైన కమాండ్ ఉంటుంది. మతం, ఆధ్యాత్మికత విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. సంపాదనకు తగినట్లు దాన ధర్మాలు చేస్తారు. జీవితంలో ఏ నిర్ణయమైనా ముందుచూపుతో వ్యవహరిస్తారు. చిన్నతనంలోనే ఉన్నత పదవులు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: China Plane Crash: చైనాలో కుప్పకూలిన మరో విమానం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు...

Also Read: Babar Azam Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు.. తొలి కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News