Omicron variant of COVID-19: ప్రపంచ దేశాలన్నింటిని ప్రస్తుతం కలవర పెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది కరోనా కొత్త వేరియంటే. దాని పేరే ఒమిక్రాన్. దక్షిణాఫ్రికాలో దీనిని నవంబర్ 23న తొలుత గుర్తించారు.
కేసులు రోజు రోజుకు రెట్టింపవుతున్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఇందుకు కారణం కొత్త వేరియంట్ అనే అనుమానంతో పరిశోధనలు చేయగా ఈ వేరియంట్ బయపడింది. దీనిని తొలుత బీ.1.1.529గా పిలిచారు. ఆ తర్వాత దానినే ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).
ఈ వేరియంట్ ఎందుకు ప్రమాదకారి?
కరోనా కొత్త వేరియంట్లు రావడం మనకు ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు కొత్త కొత్త వేరయంట్ల వచ్చాయి. ఉదాహరణకు డెల్టా, డెల్టా ప్లస్, కప్పా వంటివి. మరి ఈ వేరియంట్కుపై ఇంత ఆందోళన ఎందుకు అనే విషయంపై శాస్త్రవేత్తలు చెబుతన్న వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటి వరకు డెల్టా ప్లస్ ఇప్పటి వరకు ఆందోళనకరమైందని గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే ఒమిక్రాన్రగా నామకరణం చేసిన ఈ కొత్త వేరియంట్ మరింత ఆందోళన కరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు కారణం.. ఈ వేరియంట్ స్పైక్ ప్రోటిన్లో 30కి పైగా మ్యుటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్లే ఇది రోగ నిరోధక శక్తిని తట్టుకుని జీవించగలుగుతున్నట్లు చెబుతున్నారు.
డెల్టా ప్లస్‌లో రెండు మూడు ఉత్పరివర్తనాలను మాత్రమే గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు.
వ్యాక్సిన్‌ను తట్టుకునే సామర్థ్యం?
ఎక్కువ మ్యుటేషన్లు ఉండటం వల్ల.. సాధారణ యాంటీ బాడీలను సులభంగా తట్టుకోగలిగేలా వైరస్ రూపాంతరం చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు పని చేస్తాయనే విషయంపై ఇంకా శాస్త్రీయంగా సరైన ఫలితాలు రాలేదు. దీనిపై పరీశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
వేగంగా వ్యాప్తి చెందటం..
రోగ నిరోధక శక్తిని తట్టుకోవడమే కాకుండా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. టీకాలు వేసుకున్న వారిపైనా ఈ వేరియంట్ దాడి చేయగలదని చెబుతున్నారు. అందులల్లే ఇప్పటి వరకు చూసిన వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఒమిక్రాన్ ఆందోళనలతో ప్రపంచం అప్రమత్తం..
ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో ప్రపంచ దేశాలు మరో సారి అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, దాని సరిహద్దు దేశాలకు ప్రయాణించొద్దని తమ పౌరులను హెచ్చరిస్తున్నాయి. దీనితో పాటు ఆయా దేశాల ప్రజలను తమ దేశంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నాయి.
వెంటనే అప్రమత్తమై.. ఆంక్షలు విధించినప్పటికీ పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన వారిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.
Also read: Omicron strain: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు- కఠిన ఆంక్షల దిశగా ఇజ్రాయెల్!
Also read: Omicron In Australia: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్.. ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook