Setbacks For Israel: అడుగడుగున ఇజ్రాయెల్‌కు ఎదురు దెబ్బలు.. చేతులెత్తేస్తున్న అమెరికా!

Israel-Hamas War: హమాస్‌ దాడుల కారణంగా ఇజ్రాయెల్‌ తీవ్రంగా కూరుకుపోయింది. దీని కారణంగా ఇజ్రాయోల్‌ దేశ ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొ బతికే పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్‌ నిర్వహిస్తున్న  విచక్షణా రహిత దాడుల కారణంగా  పౌర మరణాల సంఖ్య భారీగా పెరిపోయింది. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ వస్తున్న అమెరికా సైతం  అభిప్రాయ భేదాల కారణంగా మద్దతు కోల్పోయే పరిస్థితి చేరింది.  

Last Updated : Dec 14, 2023, 12:47 PM IST
Setbacks For Israel: అడుగడుగున ఇజ్రాయెల్‌కు ఎదురు దెబ్బలు.. చేతులెత్తేస్తున్న అమెరికా!

Israel Hamas War Latest Updates:  హమాస్‌ దాడుల కారణంగా ఇజ్రాయెల్ దేశం ఉక్కిరి బిక్కిరవుతోంది.  ఇజ్రాయోల్‌ దేశ ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొ బతికే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ.. ఇజ్రాయోల్ అంతర్జాతీయ సమాజం మద్దతుకు దూరమవుతోంది. ఈ ఘటనల ద్వారా ఆ దేశానికి నూకలు చెల్లే రోజులు దగ్గర పడుతుందని తెలుస్తోంది. గాజాపై వైమానిక దాడు జరడతంతో ఇజ్రాయెల్‌ను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దేశ పౌర మరణాల సంఖ్య  తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్దతు కూడా కోల్పోవాల్సి ఉంటుందిని హచ్చరించారు. ఉత్తర గాజాలో జరిగిన దాడిలో ఇప్పటివరకు 115 మంది ఇజ్రాయెల్‌ సైనికులు యుద్ధంలో మరణించినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు జరిగిన ఆకస్మిక దాడుల కారణంగా ఇజ్రాయోల్‌కు అతి పెద్ద దెబ్బ తగిలింది. ఇంత జరిగినా మంగళవారం  షెజాయాలో సైన్యంపై దాడులు జరిగాయి. ఈ సమయంలో ఇద్దరు కమాండర్లతో సహా 9 మంది సైనికాధికారులు మృతి చెందారు. యుద్ధం జరిగిన రోజు నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ వస్తున్న అమెరికా సైతం వెనుకంజ వేస్తోంది. మంగళవారం వాషింగ్‌ టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్‌ దాడుల ఆపేయాలని డిమాండ్‌ చేసింది. ఇది జరిగిన  కొద్దిసేపటికే బైడెన్‌ స్పందించడం చర్చనీయాంశంగా  మారింది. ఇజ్రాయెల్‌ చేసే దాడుల కారణంగా ఐరోపా దేశాల మద్దతును క్రమంగా కోల్పోతుందని బైడెన్‌ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లగా గాజా ప్రజలను తమ వద్ద ఉంచి దాడులు చేస్తూ.. అణచివేయడం ఆపాలని సూచించారు.

Also Read: Telangana Cabinet: మైనార్టీ కోటాలో మంత్రి ఎవరో..? రేసులో ఆ ముగ్గురు నేతలు..!

ఇజ్రాయెల్‌ పై మారుతున్న అమెరికా అభిప్రాయం..

మరోసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని మధ్య జరుగుతున్న  అభిప్రాయ భేదాలు  బయటపడ్డాయి. దీనికి కారణం బైడెన్‌ చేసిన కీలక వ్యాఖ్యలే కారణమని స్పష్టం అవుతుంది. అమోరికా ప్రతిపాదించిన యుద్ధానంతర ప్రణాళికను ఇజ్రాయెల్‌ ప్రధాని తిరస్కరించారు. అంతేకాకుండా హౌతీ రెబల్స్‌  తమ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహంగా వ్యక్తం చేస్తుంది.

Also Read:  Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x