Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి పక్కకు తప్పుకున్న జో బైడెన్.. రేసులో కమలా హారిస్.. ?

Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. నిన్నటి వరకు డెమోక్రటివ్ పార్టీ తరుపున రెండోసారి అధ్యక్ష బరిలో దిగిన జై బెడైన్ ఎన్నికలకు మరో నాలుగు నెలలు ముందుగా వైదొలగడం అమెరికా రాజకీయాల్లో కాక రేపుతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 22, 2024, 07:23 AM IST
Joe Biden: అమెరికా అధ్యక్ష రేసు నుంచి పక్కకు తప్పుకున్న జో బైడెన్.. రేసులో కమలా హారిస్.. ?

Joe Biden: అమెరికా అధ్యక్ష అభ్యర్ధి రేసు నుంచి డెమోక్రటివ్ అభ్యర్ధిగా జో బైడెన్ తప్పుకున్నారు. ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం తో పాటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల్లో ఆయన ఘోరంగా వైఫల్యం చెందడం వంటి పలు కారణాలతో ఆయన ప్రెసిడెంట్ పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిన  పరిస్థితులు వచ్చాయి. దీంతో అనివార్యంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆయన అధ్యక్ష బరి నుంచి పక్కకు తప్పుకున్నట్టు తన సోషల్ మీడియా ఖాతాలో X లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బైడెన్ తన పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి సుధీర్ఘ లేఖను రాసాను. ఎన్నికల 4 నెలలు ముందు బైడెన్ వైదొలగడంతో డెమోక్రాటిక్ పార్టీలో గందరగోళం నెలకొంది. మరోవైపు డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్దిగా కమలా హారిస్ కు తన మద్ధతు తెలిపారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లతో పాటు ప్రజలు .. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి అయిన డొనాల్డ్ ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే 59 యేళ్ల కమలా హారిస్ మద్దతు తెలిపారు. మరోవైపు పార్టీలో ఎక్కువ మంది అభ్యర్ధులు ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ప్రైమరీల్లో 95 శాతం మంది బైడెన్ ను తమ  సంఘీభావం తెలిపారు.

81 ఏళ్ల బైడెన్ ట్రంప్ తో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పలు మార్లు తడబడ్డారు. అమెరికా అధ్యక్ష రేసులో ఈ రకంగా మిడిల్ డ్రాప్ అయిన వ్యక్తి బైడెన్ కావడం గమనార్హం.  మరోవైపు అమెరికా అధ్యక్షుల్లో అత్యంత చెత్త ప్రెసిడెంట్  బైడెన్ అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ వార్ తో పాటు అఫ్షనిస్తాన్ సహా పలు దేశాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లేలా చేయడంతో బైడెన్ తన వంతు పాత్రను పోషించారని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ డెమోక్రాట్ అభ్యర్ధిగా కమలా హారిస్ అయితే.. ఆమెను తేలిగ్గా ఓడిస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం.

మరోవైపు అమెరికా కోసం తాను చేసిన పనులను బైడెన్ తన లేఖలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ కు తక్కువ ధరల్లో ఔషధాలను అందించడంతో పాటు.. అమెరికన్ల మెడికల్ చికిత్సలను అందుబాటులో తేవడం, సుప్రీంకోర్టుకు తొలి ఆఫ్రో అమెరికన్ ను నియమించడం వంటివి చేసినట్టు తన లేఖలో పేర్కొన్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారు కావాలంటే వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో తీసుకునే నిర్ణయంపై ఆమె అభ్యర్థిత్వం ఖరారు అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కమలా హారిస్ అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రాట్ల తరుపున ఎన్నికతే.. ఆమె తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించడం ఖాయం అని చెప్పాలి. అయితే.. అయితే.. ట్రంప్ పై కాల్పుల నేపథ్యంలో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడక అని పలు ఎన్నికల సర్వేలు పేర్కొంటున్నాయి.

యూఎస్ లో  ప్రతి ఫోర్ ఇయర్స్ కు ఒకసారి ఎలక్షన్స్  జరగడం ఆనవాయితీ వస్తోంది. ప్రతి నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ ఫస్ట్ మంగళవారం ఇక్కడ ఎలక్షన్స్ కండెక్టర్ చేస్తారు.  ఆ ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ వస్తుంది. ఈ యేడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున  డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. మరోవైపు డెమాక్రాట్స్ తరుపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ఎవరు డెమోక్రాట్స్ తరుపున ఎవరు అధ్యక్ష రేసులో నిలుస్తారనేది చూడాలి.  

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News