పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల పై పాకిస్తాన్ టెర్రరిస్టుల గురి..!

పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.

Last Updated : May 11, 2018, 01:10 PM IST
పంజాబ్ గ్యాంగ్‌స్టర్ల పై పాకిస్తాన్ టెర్రరిస్టుల గురి..!

పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇదే విషయం పై ఒక రిపోర్టు తయారు చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ కార్యాలయానికి పంపించింది.

అలాగే ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇచ్చే పలు సంఘాలకు ఐఎస్‌ఐ ఆర్థిక సహాయాన్ని కూడా అందించే అవకాశం ఉందని ఈ రిపోర్టు తెలుపుతోంది. ఈ క్రమంలో హోంశాఖ స్థానిక పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయాలు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను అప్రమత్తం చేసింది. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. దేశంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని తెలిపింది.

ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక నేరస్తులపై ఓ కన్నేసి ఉంచమని హోంశాఖ తెలిపింది. ముఖ్యంగా పంజాబ్‌ యువతను టెర్రరిజం వైపు మళ్లించడానికి యూకే నుండి ఒక గ్రూపు సోషల్ మీడియా క్యాంపైన్ కూడా ప్రారంభించిందని.. అలాంటి గ్రూపులపై ప్రత్యేక నిఘా పెట్టాలని శాఖ తెలిపింది.

హవాలా ద్వారా ఈ గ్రూపులు భారతదేశంలోని గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులకు డబ్బు పంపిస్తున్నాయని.. అలాగే తమకు సహాయం చేసే నేరస్తుల కుటుంబ సభ్యులకు ఈ గ్రూపులు ఆర్థిక అవసరాలు తీర్చడంతో పాటు వారి పిల్లలకు చదువు చెప్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం వంటి పనులు కూడా చేస్తున్నాయని రిపోర్టు తెలుపుతోంది. ఇటీవలే బబ్బర్ ఖల్సా అనే టెర్రరిస్టు గ్రూపు భారతీయ యువతను టెర్రిరిజం వైపు మళ్లించడం కోసం పాకిస్తాన్, జర్మనీ, యూకే, అమెరికా లాంటి దేశాల్లో సమావేశాలు కూడా నిర్వహించిందని హోంశాఖకు అందించిన రిపోర్టులో ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది.

Trending News