Electric Shock: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో 4 ఏనుగులు మృతి..

Parvathipuram district: అకాల వర్షాలు, అధికారుల నిర్లక్ష్యం మూగజీవాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ట్రాన్స్ ఫార్మర్ను తాకి నాలుగు ఏనుగులు మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకున్నాయి. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2023, 01:56 PM IST
Electric Shock: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో 4 ఏనుగులు మృతి..

4 Elephants died with electric shock: పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. కరెంట్ షాక్ తగిలి నాలుగు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడం వల్ల ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటన భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద చోటుచేసుకుంది. 

మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురయ్యాయి. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వకొండవైపు వెళ్లిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మిగతా రెండు ఏనుగులు వెళ్లిన కొండవైపు స్థానికులు వెళ్లొద్దని అధికారులు స్థానికులకు సూచించారు.

గతంలో కూడా..
గత మార్చి నెలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వ్యవసాయ పొలానికి వేసిన విద్యుత్ కంచెను తాకడం వల్ల మూడు ఏనుగులు మృతి చెందిన ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోడు తాలూకా శంకరాపురంలో జరిగింది. అడవి పందుల నుంచి రక్షించేందుకు రైతులు ఈ విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తారు. గజరాజుల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. అకాల వర్షాలకు భారీ వృక్షాలు కుప్పకూలడం, కరెంటు తీగలు తెగిపడతాయి. ఈ విద్యుత్ తీగలకు మనుషులు, మూగజీవాలు బలైపోతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తరుచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

Also Read: AP High Court: ఏపీ ప్రభుత్వానికి షాక్, జీవో నెంబర్ 1 కొట్టివేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News