ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా మాకు సంజీవనే

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న కేంద్రం ఇచ్చిన హామీని చర్చించడానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఆదివారం సమావేశమైంది

Last Updated : Feb 18, 2018, 06:19 PM IST
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా మాకు సంజీవనే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న కేంద్రం ఇచ్చిన హామీపై చర్చించడానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఆదివారం సమావేశమైంది.  సీపీఎం జాతీయ కార్యదర్శి పి.మధు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, వైసీపీ నాయకుడు పార్థసారథి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని విభేదించే సంఘాల ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.  

'ప్రత్యేక హోదాకు మద్దతుగా ఉన్న వ్యక్తులతో కలిసి మేమంతా ముందుకు వెళ్తాము. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు ప్రత్యేక హోదాను గురించి తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు 'ఆంధ్రప్రదేశ్ ఆత్మ-గౌరవ దీక్ష'ను నిర్వహిస్తాము" అని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు.

సీపీఎం జాతీయ కార్యదర్శి మధు మాట్లాడుతూ "భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను 6వ తేదీ తర్వాత చర్చించనున్నాము. కొన్ని పార్టీలు రాజకీయ క్రీడలలో బిజీగా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలలో రైల్వే జోన్ ప్రారంభిస్తామని చెప్పారు. విద్య కోసం రూ.9000 కోట్లు నిధులు సేకరిస్తామని చెప్పారు. కానీ కేవలం రూ.420 కోట్లు విడుదలయ్యాయి. కేంద్రం ఇలాగే నిధులు ఇచ్చుకుంటూ పోతే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడి నిర్లక్ష్య ధోరణి వల్ల కేంద్రం ఇలా చేస్తోంది' అని అన్నారు.  

"చంద్రబాబు నాయుడు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడు. ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నాడు" అని వైయస్సార్ నాయకుడు పార్థసారథి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రము విడిపోయాక.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ వెల్లువెత్తుతూనే ఉంది.

Trending News