అమరావతి: ఏపీలో అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో, పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యేక కేటాయింపులు జరిపింది. గ్రామ వాలంటీర్లకు రూ. 720 కోట్లు, గ్రామ సచివాలయ నిర్వహణకు రూ. 700 కోట్లు, మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ. 280 కోట్లు, మున్సిపల్ సచివాలయాలకు రూ. 180 కోట్లు కేటాయించినట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.