AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటే

AP EDCET2024: ఆంధ్రప్రదేశ్ బీఈడీ కళాశాల్లో ప్రవేశానికై నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2024 ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్ధుల్నించి నిన్న ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2024, 07:51 AM IST
AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటే

AP EDCET2024: ఏపీలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ప్రతియేటా నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్ 18న ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 15 వరకూ కొససాగనుంది. ఈ పరీక్షకు అప్లై చేసేవారి అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. మే 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో ప్రవేశముంటుంది. ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం ఉండాన్నా ఎంట్రన్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 8 వతేదీన ఉదయం 9 గంటల్నించి 11 గంటల వరకూ జరుగుతుంది. ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 15న విడుదల కానుంది. జూన్ 18వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. తరువాత ఫలితాల వెల్లడి ఉంటుంది. 

ఏపీ ఎడ్‌సెట్ 2024 కు అప్లై చేసేందుకు ఓసీ కేటగరీ విద్యార్ధులకు 650 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే బీసీ అభ్యర్ధులయితే 500 రూపాయలు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రం 450 రూపాయలుంటుంది. మే 30 నుంచి ఏపీ ఎడ్‌సెట్ 2024 హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

2024 జూలై 1 నాటికి కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా ఎలాంటి వయో పరిమితి లేదు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బీటెక్-బీఈల్లో అయితే 55 శాతం మార్కులు వచ్చి ఉంటే ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు 40 శాతం మార్కులొస్తే సరిపోతుంది. పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. మొత్తం రెండు గంటల సమయం ఉంటుంది. 

మే 15 దరఖాస్తులకు చివరి తేదీ కాగా 1000 రూపాయల జరిమానాతో మే 19 వరకూ అప్లై చేయవచ్చు. అదే 2000 రూపాయలు జరిమానాతో మే 21 వరకూ గడువుంటుంది. ఏపీ ఎడ్‌సెట్ 2024 పరీక్షలో జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, టెక్నికల్ ఆప్టిట్యూట్, మెథడాలజీ మూడు విభాగాల్లో ఉంటుంది. మెథడాలజీలో మేధ్స్, ఫిజిక్స్, బయోలజీ, సోషల్, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు అంశాల్నించి ప్రశ్నలుంటాయి. 

Also read: Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News