Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..

Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 4, 2024, 12:49 PM IST
Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..

Minister roja tweets over ap assembly election results 2024: ఆంధ్ర ప్రదేశ్  ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీకి పెద్ద దెబ్బగా మారినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. అధికార వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది మంత్రులు, కీలక నేతలు ఇప్పటికే వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, కోడాలినాని, రోజా, వల్లభనేని వంశీ, బొత్స సత్యనారాయణ లతో పాటు దాదాపు మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో ఈ ఫలితాలు వైఎస్సార్పీకీ పెద్ద షాక్ గా భావించవచ్చు. ఇక మరో  వైపు  ఓటమి దిశగా వెళ్తున్న మంత్రి రోజు ఎక్స్ వేదికగా ఎమోషనల్ గా వేదాంతం వళ్లిస్తు ట్విట్ చేశారు. ఈ ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంత్రి రోజు ఎక్స్ వేదికగా... భయాన్ని విశ్వాసంగా, మనకు జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలను మెట్లుగా.. ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని సరైన తీసుకుని, చేసిన పొరపాట్లను పాఠాలుగా తీసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని కూడా పోస్టు చేశారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో రోజా నగరి నుంచి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోజా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. 

వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్..

నగరీ నుంచి బరిలో దిగిన మంత్రి రోజాను ఫైర్ బ్రాండ్ గా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో.. రోజా అనేక సందర్భాలలో టీడీపీ, జనసేన నేతలపై రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును వెన్నుపోటు, పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్ల విషయంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలు అనేక సందర్భాలలో సంచలన ఆరోపణలు చేశారు.

దెబ్బకొట్టిన మూడు రాజధానుల అంశం..

సీఎం వైఎస్ జగన్ కు మూడు రాజధానుల అంశం దెబ్బతీసిందని చెప్పుకొవచ్చు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంను కొందరు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ చెందిన కొందరు నేతలు అనేక సందర్భాలలో.. టీడీపీ నేతల్ని, జనసేనలను టార్గెట్ చేయడం కూడా ఇప్పుడు వైఎస్సార్పీపీ మైనస్ అయినట్లు తెలుస్తోంది.
 

Trending News