AP Assembly Election 2024 Winners List: జనసేన కి షాక్..పిఠాపురం బ్యాలెట్ లో ఎక్కువగా చెల్లని ఓట్లు

AP Lok Sabha Election 2024 Full Winner List: పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాక్ ఎదురైంది. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ఎదురుచూస్తున్న జనసేన కార్యకర్తలకు.. పోస్టల్ బ్యాలెట్ లెక్క ప్రారంభం కాగానే.. అక్కడ ఎక్కువ చల్లని ఓట్లు తేలి.. అందరిని ఆశ్చర్యపరిచాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 4, 2024, 10:43 AM IST
AP Assembly Election 2024 Winners List: జనసేన కి షాక్..పిఠాపురం బ్యాలెట్ లో ఎక్కువగా చెల్లని ఓట్లు

Andhra Pradesh Assembly Election 2024 Winners and Loosers List:  జనసేన కార్యకర్తలకు మొదట్లోనే పెద్ద షాక్ ఎదురయ్యింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం తథ్యం. కానీ మొదట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్క పెట్టేటప్పుడు మాత్రం.. ఆ ఆనందం కొంచెం నిరాశగా మారింది. అందుకు ముఖ్య కారణం పిఠాపురంలోని పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా చల్లని ఓట్లు రావడం.

ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థానాల ఎన్నికల ఫలితాలన్నీ ఓ లెక్క అయితే.. పిఠాపురం రిజల్ట్ మరో లెక్క. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం పిఠాపురం రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం పిఠాపురం నుంచి కూటమి అభ్యర్ధిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.. అతనికి పోటీగా వైసీపీ నుంచి వంగా గీతా పోటీ చేయడమే. కాగా వీరిద్దరి మధ్య పోటీ హోరా హోరీగా సాగడంతో.. మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తాం అంటూ నిన్నటి వరకు రెండు పార్టీల వారు పోటాపోటీగా పొలిటికల్ ఫైటింగ్‌కి దిగారు.

మరోపక్క జనసైనా కార్యకర్తలు అయితే ముందుగానే పండగ చేసుకోవడం మొదలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కూడా.. తాను ఆల్రెడీ గెలిచేశానని.. లక్షకి పైగా మెజారిటీ వస్తుందని.. చాలా గట్టి నమ్మకంతో చెప్పాడు. ఫలితం రావడం మాత్రమే ఆలస్యం అని ఎన్నికలకు ముందే ప్రకటించారు పవర్ స్టార్. ఇక వంగా గీత అయితే అతనికంత సీన్ లేదని.. తాను లోకల్ మనిషిని అని.. అతను మాటలు చెప్తాడు.. మేం చేతలో  చేసి చూపిస్తాం.. ఓట్లు పడేది మాత్రం మాకేనని తన నమ్మకం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో ఈరోజు జూన్ 4వ తేదీ ఉదయం పిఠాపురంలోని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు మొదలుకాగానే.. జనసేనకి షాక్ ఎదురైంది. పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువగా చల్లని ఓట్లు నమోదయ్యాయి. ఆ తరువాత లెక్కింపులో పవన్ కళ్యాణ్ మెజారిటీతో కొనసాగుతున్న…మొదట్లో మాత్రం ఇలా చల్లని ఓట్లు రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.

Also read: Southwest Monsoon: వేగంగా కదులుతున్న రుతు పవనాలు, ఏపీలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News