AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?

AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2024, 10:30 AM IST
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?

AP Polls 2024: జనసేన పార్టీ 2014లో మాదిరిగా 2024లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీతో కూటమిగా బరిలో దిగింది. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాజోలు సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్.. గాజువాక, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది. ఈ సారి ఎన్నికల్లో ఏపీలో అధికార పీఠంపై కూర్చున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సారి ఎన్నికల్లో గతంలో కంటే ఓట్లు శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ సారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆయనపై వైసీపీ తరుపున వంగా గీత బరిలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సారి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి గాలి వీచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన చెబుతున్నారు. తనను దత్త పుత్రుడున్నా.. ప్యాకేజీ స్టార్‌ అన్నా.. అవేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కూటమి తరుపున బలంగా పోరాడారు. ముఖ్యంగా ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేయడం వెనక పవన్ కళ్యాణ్ కృషి ఉంది. ఒకవేళ కూటమి అధికారంలో వస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్‌కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

జనసేన 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసింది.

అందులో జనసేన కూటమి అంచనాల ప్రకారం జేఎస్పీ గెలిచే స్థానాలు ఇవే నంటూ కొంత మంది సెఫాలిజిస్టులు చెబుతున్నారు. అవేమిటంటే..

అనకాపల్లి..
పెందుర్తి
పిఠాపురం
కాకినాడ (రూరల్)
నర్సాపురం
ఎలమంచిలి
పి.గన్నవరం
భీమవరం
తాడేపల్లి గూడెం
అవనిగడ్డ
తెనాలి ఈ 11 స్థానాల్లో జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

Also Read: New Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!

అటు నువ్వానేనా అన్నట్టుగా ఉన్న స్థానాల విషయానికొస్తే..
వైజాగ్ (దక్షిణం)
రాజానగరం
నిడదవోలు
తిరుపతి ఉన్నాయి.

ఇక వైసీపీ గెలుపుకు ఎక్కువ అవకాశాలున్న జనసేన పోటీ చేసిన స్థానాల విషయానికొస్తే..
నెల్లిమర్ల
రాజోలు
ఉంగటూరు లో వైసీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అసలు జనసేన అసలు గెలిచే అవకాశాలు లేని స్థానాల విషయానికొస్తే..
రైల్వే కొడూరు
పోలవరం
పాలకొండ (ST) స్థానాల్లో జనసేన గెలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు.
జనసేన గాజు గ్లాసు ఖచ్చితంగా జయకేతనం ఎగరేసే స్థానాల విషయానికొస్తే..
అనకాపల్లి
పెందుర్తి
పిఠాపురం
కాకినాడ రూరల్
నర్సాపురం స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. మిగిలిన 6 స్థానాల్లో జనసేన గెలుపుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అటు ఎంపీ సీట్లైన కాకినాడ, మచిలిపట్నం సీట్లను జనసేన ఖచ్చితంగా గెలుస్తోంది. అంతేకాదు కొత్త పార్లమంట్ భవనంలోకి జనసేన పార్టీ అభ్యర్ధులు వెళ్లడం పక్కా అని చెబుతున్నారు. మరి సెఫాలిస్టులు చెబుతున్నట్టు జనసేన ఎన్ని సీట్లను గెలుస్తుందనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్‌ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్‌' బాంబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News