AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండి

AP Medical Admission Quota: నీట్ 2024 కౌన్సిలింగ్ జరుగుతోంది. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల కన్వీనర్ కోటా విడుదలైంది. రిజర్వేషన్ కేటగరీ ఆధారంగా ఎవరికి ఏ కళాశాలలో సీటు లభించిందనేది ఈ జాబితాతో చెక్ చేసుకోవచ్చు. పూర్తి జాబితా లింక్ https://apuhs-ugadmissions.aptonline.in/mbbs/Home/Bulletinopen?RowId=142 ఇదే

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 16, 2024, 10:27 AM IST
AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండి

AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. ఈ జాబితాలో రాష్ట్రంలోని 35 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు వివరాలు రిజర్వేషన్ ఆధారంగా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కలిపి మొత్తం 3,789 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రత్యేక కేటగరీ కింద వికలాంగులు, సాయుధ బలగాలు, ఎన్‌సీసి, స్పోర్ట్స్ కోటాలో 267 సీట్లు ఉన్నాయి. మిగిలిన 3,612 సీట్లను మొదటి విడత కౌన్సిలింగ్‌లో భాగంగా విడుదల చేశారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసిన మొదటి విడత కౌన్సిలింగ్ జాబితాలో రిజర్వేషన్లు, రోస్టర్ ఆధారంగా 3,507 సీట్లు భర్తీ చేయనున్నారు. మిగిలిన 105 సీట్లలో 102 సీట్లు మైనార్టీ కేటగరీ, మూడు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉన్నాయి. మొదటి దశలో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్ధులు ఈ నెల 19వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి. అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసిన కన్వీనర్ కోటా మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ల వివరాలను https://apuhs-ugadmissions.aptonline.in/mbbs/Home/Bulletinopen?RowId=142 ద్వారా చెక్ చేసుకోవచ్చు. 

ఈ జాబితాలో నీట్ ర్యాంక్, నీట్ రోల్ నెంబర్, నీట్ మార్కులు, విద్యార్ధి పేరు, కేటగరీ, ఏరియా ఆధారంగా క్షుణ్ణంగా సీట్ల వివరాలు ఉన్నాయి. 

Also read: Milad Un Nabi: మీలాద్ ఉన్ నబి విశిష్టత ఏంటి, ముస్లింలు అందరూ జరుపుకోరా ఎందుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News