Andhra Pradesh: ఇవేం రాజకీయాలు.. బొంతు రామ్మోహన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ లీడర్..

BudhaVenkanna: ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ నేత, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 18, 2024, 04:53 PM IST
  • - మాజీ బీఆర్ఎస్ నేతపై ఫైర్ అయిన ఏపీ టీడీపీ లీడర్..
    - మూడు నెలలకే పార్టీమారతారా.. అంటూ సెటైర్ లు..
Andhra Pradesh: ఇవేం రాజకీయాలు.. బొంతు రామ్మోహన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ లీడర్..

Buddha Venkanna Comments Over Bontu Rammohan: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పథకం అమలులోకి తీసుకొచ్చే విధంగా పాలన చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చారు. మహిళలు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ పాలన పట్ల ఆకర్శితులై.. పలువులు బీఆర్ఎస్ కీలక నేతలు ఇటీవల కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. 

Read More: Haircare Tips: ఒత్తైన మందపాటి జుట్టు కావాలా? షహనాజ్ హుస్సేన్ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి..

పట్నం మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయోద్దీన్, మరికొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ గా ఉండటానికి మాజీ సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఇలాంటి పార్టీ ఓడిపోగానే మూడు నెలల్లోనే పార్టీ మారతారా.. ఇవేం రాజకీయాలు అంటూ.. ఏపీ టీడీపీ నేత బుద్ధావెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

ఇలాంటి రాజకీయాలుచూస్తే.. చాలా బాధేస్తుందని అన్నారు. తనకు చంద్రబాబు కుటుంబంలోని ఐదుగురు తప్ప మరేవరు తెలియదనిన కూడా బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు.. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని, రక్తంతో గోడమీద రాసి తెలియజేశారు బుద్ధా వెంకన్న. గోడమీద జై చంద్రబాబు అని.. నా ప్రాణం మీరే అంటూ రాసుకొచ్చారు. 

Read More: Shivatmika Rajasekhar: గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్.. సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

చంద్రబాబు తనకు దేవుడని, తనకు సీటు ఇచ్చే విషయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్న స్వాగతిస్తానని చంద్రబాబు పట్ల తనకున్న స్వామి భక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు కీలకంగా మారాయి. ఒకవైపు వైఎస్ జగన్ వై నాట్ 175 అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. టీడీపీ కూడా అనేక చోట్ల నేతలను మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకు ప్రయారిటి ఇస్తున్నాడు. ఇక.. మరోవైపు షర్మిలా వైస్ జగన్ ను, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తులపై అతి తొందరలనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x