close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

చంద్రబాబుతో పోల్చుతూ జగన్ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సెటైర్లు 

చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచితే జగన్ ఏకంగా వదరల్లో ముంచేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవ చేశారు.

Updated: Sep 11, 2019, 06:50 PM IST
చంద్రబాబుతో పోల్చుతూ జగన్ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సెటైర్లు 

గుంటూరు: చంద్రబాబు పాలనతో పోల్చుతూ వైఎస్  జగన్ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు సంధించారు. పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో మంచితే .. వైఎస్ జగన్ వరదల్లో ముంచుతున్నారని ఎద్దేవ చేశారు. వరదలను నియంత్రించడం చేతగాకపోతే నిపుణుల సలహా తీసుకొని పనిచేయాలే గానీ ..ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

తక్షణమే వరద విషయంలో చర్యలు తీసుకుని ముంపు సమస్యతో పాటు రోగాలు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఆయా గ్రామాల్లో జనాలు ఇబ్బందిపడుతుండటంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా ఈ మేరకు స్పందించారు.