Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యరంగ బలపేతానికి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాల్ని అన్ని ప్రాంతాలకు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క మెడికల్ కళాశాల( Medical College) ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) నిర్ణయం. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయదలిచారు. పులివెందుల, పాడేరు వైద్య కళాశాలలకు ఇప్పటికే శంకుస్థాపన పూర్తి కాగా..మిగిలిన 14 మెడికల్ కళాశాలలకు ఇవాళ వర్చ్యువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు.
గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత పెద్దఎత్తున వైద్య కళాశాలల ఏర్పాటు జరగలేదు. వర్చ్యువల్ విధానంలో ఇవాళ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లాల పరిధిలో ఆయా అధికారులు పాల్గొంటారు. ఇవాళ ఒకేసారి పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని ప్రాంతాల్లో మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన ( Foundation Stone) జరగనుంది.
Also read: Lockdown: ఏపీ, తెలంగాణల్లో లాక్డౌన్ సడలిస్తున్నారా..పొడిగిస్తున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook