విగ్రహానికి 2.5 వేల కోట్లు..రాజధానికి మాత్రం 1500 కోట్లు !

Last Updated : Apr 21, 2018, 06:00 PM IST
విగ్రహానికి 2.5 వేల కోట్లు..రాజధానికి మాత్రం 1500 కోట్లు !

ఏపీ సీఎం చంద్రబాబు మోడీ సర్కార్ పై మరోసారి ధ్వజమెత్తారు. ఏపీకి మోడీ సర్కార్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. శనివారం సాధికార మిత్రులతో ఏపీ  సీఎం  ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తుందన్నారు. కేంద్రం విగ్రహానికి ఇచ్చిన విలువ కూడా 5 కోట్ల మంది తెలుగువాళ్లకు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి రూ. 2 వేల 500 కోట్లు కేటాయించిన మోడీ సర్కార్.. నవ్యాంధ్ర రాజధాని కోసం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఒక్క విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత.. రాజధానికి ఎందుకు ఇవ్వడం లేదో కేంద్రం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ప్రధాని ఎంపికలో టీడీపీదే కీలక పాత్ర
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు వడ్డీతో సహా రాబడతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మోడీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకున్నట్లయితే మన మాట వినేవారని.. మోజార్టీ ఉందనే ధీమాతో బీజేపీ ఇలా వ్యవహరిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో  ఫలితాలు ఏకపక్షంగా ఉండబోవని.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని చంద్రబాబు జోక్యం చెప్పారు. అప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారతాయని..  ప్రధాని ఎంపిక విషయంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

Trending News