Mangali Krishna: బిగ్ బ్రేకింగ్.. సీఎం జగన్ ముఖ్య అనుచరుడు అరెస్ట్?

Mangali Krishna: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెడుతున్న సమయంలోనే ఏపీకి సంబంధించిన కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుని హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపింది.

Written by - Srisailam | Last Updated : Sep 15, 2022, 02:11 PM IST
  • మంగళి కృష్ణపై హైదరాబాద్ లో కేసు
  • మంగళి కృష్ణ సీఎం జగన్ మిత్రుడు
  • స్టేషన్ లో రాజీ కుదిరిందన్న సీఐ
 Mangali Krishna: బిగ్ బ్రేకింగ్.. సీఎం జగన్ ముఖ్య అనుచరుడు అరెస్ట్?

Mangali Krishna: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెడుతున్న సమయంలోనే ఏపీకి సంబంధించిన కీలక పరిణామం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడుని హైదరాబాద్ పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన పులివెందులకు చెందిన మంగలి కృష్ణ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళి కృష్ణను గచ్చిబౌలి పోలీసులు ప్రశ్నించారు.  గచ్చిబౌలిలో ఉన్న ఒక విల్లా యజమానించిన ఫిర్యాదు మేరకు మంగళ కృష్ణ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

గత ఏడాది కాలంగా విల్లాలో నివాసముంటున్నారు మంగళి కృష్ణ. అయితే ఏడాదిగా అతను ఇంటి అద్దెను చెల్లించలేదు. ఇంటి అద్దెను అడిగిన విల్లా యజమాని శివ ప్రసాద్ రెడ్డిని మంగలి కృష్ణ బెదిరించారనే ఆరోపణలు వస్తున్నాయి. రెంట్ అడిగిన తనపై మంగళి కృష్ణతో పాటు అతని అనుచురులు దాడి చేశారని శివప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు మంగళి కృష్ణను అదుపులోనికి తీసుుకన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి ప్రశ్నించారని తెలుస్తోంది.

అయితే మంగళికృష్ణపై అరెస్ట్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు గచ్చిబౌలి CI సురేష్. మంగళి కృష్ణ పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. విల్లా యజమాని శివ ప్రసాద్ రెడ్డికి మంగళి కృష్ణ అద్దె చెల్లిపుల విషయంలో చిన్న వివాదం తలెత్తిందన్నారు.శివ ప్రసాద్ రెడ్డి,మంగళి కృష్ణ ఇద్దరు పాత మిత్రులేనని తెలిపారు, పోలీస్ స్టేషన్ లో శివ ప్రసాద్ రెడ్డి. మంగళి కృష్ణ  రాజీ కుదుర్చుకోవడంతో సమస్య పరిష్కారం అయిందన్నారు సీఐ సురేష్.

Also read: KTR TARGET BJP: విశ్వ గురు వద్దంటారు.. ఆయన శిష్యుడేమో ఇస్తానంటారు! ఉచితాలపై బీజేపీని ఉతికిఆరేసిన కేటీఆర్..

Also read: AP Assembly Live Updates: చంద్రబాబును తీసుకురావాలన్న జగన్.. వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News