Modi Central Cabinet: 2025 కొత్త యేడాదిలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర క్యాబినేట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుకుంది. అందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న పలు కీలక ప్రాజెక్టులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలకు నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు నిరుద్యోగులకు శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త యేడాది డీఏతో పాటు కరువు భత్యం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 9 వేల కోట్ల భారం పడనుంది. మరోవైపు గతంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త యేడాదిలో అడ్వాన్స్ గా కొంత బకాయిలు చెల్లించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా కేబినేట్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.