Year Ender 2024: పొలిటిషన్ ఆఫ్ ది ఇయర్ పవన్ కళ్యాణ్..

Year Ender 2024 - Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. 2024లో పొలిషియన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పాలి. ఈయన ఈ యేడాది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో జరిగిన ఎన్నికల్లో చెరగని ముద్ర వేసారు. అంతేకాదు.. ఏపీతో పాటు దేశంలో ఢిల్లీ గద్దెపై నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి కొలువు దీరడంలో ఈయనే ఉన్నారని చెప్పారు. ఓ రకంగా 2024లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పొలిటిషన్ గా రికార్డులకు ఎక్కారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 31, 2024, 12:41 PM IST
Year Ender 2024: పొలిటిషన్ ఆఫ్ ది ఇయర్ పవన్ కళ్యాణ్..

Year Ender 2024 - Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్యాన్ ఇండియా హీరో కాకుండానే.. ప్యాన్ ఇండియా పొలిటిషిన్ గా నిలిచారు. దేశంలో, ఏపీలో అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారు. అంతేకాదు తిరుమల లడ్డూ వ్యవహారంతో జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డ్ స్థాపించాలని ఎలిగెత్తి చాటడంతో ఈయనకు దేశ వ్యాప్తంగా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.  అంతేకాదు హిందుత్వ అంటేనే మన దేశంలో కొంత మందికి గిట్టదు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించడం అంటూ చెప్పి కొంత మంది కుహానా సెక్యులర్ వాదులకు చెంప చెళ్లు మనిపించేలా సమాధానం ఇచ్చారు.

మొత్తంగా చూసుకుంటే ఏపీ రాజకీయ యవనికై ఎక్కడా నెగ్గాలో కాదు.. ఎక్కడా తగ్గాలే తెలిసిన వాడే అసలు సిసలు నాయకుడు అన్నట్లు.. సీట్ల విషయంలో కొంత వెనక్కి తగ్గి ఏపీలో  కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటంలో తన వంతు భూమిక వహించారు అసలు సిసలు పొలిటిషియన్ గా నిలిచారు. 2023లో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా తెలుగు దేశం పార్టీకి సంఘీభావం ప్రకటించి ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.2024లో అధికారం ఒడిసి పట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఎంతో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అప్పటి వరకు అధికారంలో ఉన్న  ప్రభుత్వ వ్యతిరేక వైసీపీ ఓటు చీలనివ్వను అంటూ ఛాలెంజ్  చేసి పంతం నెగ్గించుకున్నారు జనసేనాని. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో  పొత్తులో భాగంగా 21 శాసనసభ సీట్లతో పాటు 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసారు. అతేకాదు పోటీ చేసినా.. అన్ని స్థానాల్లో నెగ్గి 100కి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధంచిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు వైసీపీని 11 సీట్లకే కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉంది. ఓ రకంగా 2024  ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడానికి.. తెలుగు దేశం పార్టీ అధినేత.. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమే చెప్పాలి.

మరోవైపు జనసేన అధినేత 2009లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం లో యువరాజ్యం అధినేతగా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 సీట్లలో నెగ్గారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీ స్థాపించి.. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. కానీ ఏ సీట్లలో ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కనీసం ఏ పదవి తీసుకోకుండా అన్నింటిని త్యాగం చేసి త్యాగరాజు అనిపించుకున్నారు.  ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి  జనసేన కేవలం ఒక సీటుకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  పోటీ చేసినా రెండు చోట్లా పోటీ ఓడిపోయారు. దీంతో ఎక్కడా నిరాశా పడకుండా.. పోగొట్టుకున్న చోటే తాను రాబట్టుకొన్నాడు. అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ సీఎం అయ్యారు.

పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం దక్షిణాదిని బీజేపీ ట్రంప్ కార్డ్ గా మారారు. రీసెంట్ గా  మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచింది. ఈ రకంగా ప్రచారం చేసిన అన్ని చోట్లా గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన నేతగా  మరో రికార్డు క్రియేట్ చేసారు. ప్రెజెంట్ సౌత్ లో భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్  స్టార్ క్యాంపెనర్ గా మారారు. అంతేకాదు అయితే 2024లో మన దేశంలో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పేర్లలో పవన్ కళ్యాణ్ నేమ్ కూడా ఉండటం విశేషం. టాప్ 5లో నిలిచారు.

మరోవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి  ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అక్కడి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కేవలం మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే బీజేపీ అద్బుత ప్రదర్శన చేసింది. అంతేకాదు మెజారిటీకి సగం సీట్లైన 272కు 32 సీట్ల తక్కువగా 240 సీట్ల దగ్గరలోనే ఆగిపోయింది. కేవలం మిత్రపక్షాలతో కలిపి 293 సీట్లు సాధించింది. ఒక రకంగా కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కీలకంగా వ్యవహరించారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేకుంటే నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని పీఠం ఎక్కడం అంత ఈజీ కాదనే వాదనలు రాజకీయ పక్షాల నుంచి వినిపించాయి. మొత్తంగా ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో పాటు.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడానికి ఆంధ్ర ప్రదేశ్ లో  పవన్ కళ్యాణ్ చేసిన కృషినే కీలకం అని చెప్పాలి. ఓ రకంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో అసలుసిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు. సనాతన ధర్మాన్ని భుజానా ఎత్తుకోవడంతో 2024లో పొలిటిషియన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News