CM Jagan Review Meeting on Agriculture: ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. దీనిని సవాల్‌గా తీసుకోవాలని ఆదేశించారు. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఈ నెల 29న జమ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సాధారణ వర్షపాతం (జూన్ నుంచి నవంబరు వరకు) 775 మి.మీ. కాగా.. ఈ ఏడాది 781.7 మి.మీ.వర్షపాతం నమోదైందన్నారు.
186 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఉంటాయని అంచనా వేస్తున్నామని ఈ–క్రాపింగ్ నమోదుపై వివరాలను జగన్ మోహన్ రెడ్డికి అధికారులు అందించారు. వీఏఏ, వీఆర్వో బయోమెట్రిక్ ఆథరైజేషన్ వందశాతం పూర్తి చేశామని చెప్పారు. అదేవిధంగా రైతుల నుంచి 93 శాతం ఈ–కేవైసీ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ఏడు శాతం రైతులకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ–క్రాప్ వివరాలు పంపించాలని సీఎం సూచించారు. గ్రామంలో రైతుల సమక్షంలో సోషల్ ఆడిట్ కూడా నిర్వహించామన్న అధికారులు.. ధాన్యం సేకరణపై ప్రణాళికను వివరించారు.
అనంతరం సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. ఎంఎస్‌పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని.. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని చెప్పారు. ఇక నుంచి ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామన్నారు. అన్నదాతలకు ఎక్కువ ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ ఉండాలని సూచించారు. ఈ–క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ కొనసాగాలన్నారు రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా అన్నదాతలకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుని.. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సున్నావడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఈ నెల 29న జమ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: Hardik Pandya: హర్ధిక్ పాండ్యా హిట్ వికెట్.. సైలెంట్‌గా బెయిల్స్ వికెట్లపై పెట్టేశాడు.. వీడియో వైరల్
Also Read: KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook