Tirupati Bypoll: కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా వైఎస్ జగన్ తిరుపతి సభ రద్దు

Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక  ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2021, 07:04 PM IST
Tirupati Bypoll: కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా వైఎస్ జగన్ తిరుపతి సభ రద్దు

Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక  ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నిక(Tirupati Bypoll)కు మరి కొద్దిరోజులే సమయం మిగిలింది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి సభ (Tirupati Meeting)ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో వైఎస్ జగన్ (Ap cm ys jagan)అప్రమత్తమయ్యారు. తన సభకు భారీగా జనం హజరయ్యే అవకాశమున్నందున..కరోనా వైరస్ ప్రబలే పరిస్థితి ఉందని తలచి..సభను రద్దు చేసుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

సీఎం జగన్ ఏమన్నారంటే..

నిన్న ఒక్కరోజే 2 వేల 765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా.గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా.గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నా.

కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) పంజా విసురుతున్న తరుణంలో ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సభను రద్దు చేసుకోవడం ఎన్నికల వేళ సాహసమైన నిర్ణయమే కానీ..ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుంటే మంచి నిర్ణయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also read: Ap Vaccination: ఏపీకు త్వరలో కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News