ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్య ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పరీక్షలను ముందుగానే నిర్వహిస్తున్నాం. పరిక్షలన్నీ ఆన్లైన్ లోనే జరుగుతాయి అని విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
2016-18 బీఎడ్, డీఎడ్ విద్యార్థులకు శుభవార్త
2016-18 బీఎడ్, డీఎడ్ విద్యార్థులకు టెట్ లో అర్హత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని గంటా తెలిపారు. వచ్చే ఏడాది ఏ గ్రేడ్ కాలేజీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం(డిగ్రీతో పాటు బీఎడ్) ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తాం అని అన్నారు.
ప్రవేశ పరిక్షలు | తేదీ | సమయం |
ఏపీ-ఎడ్ సెట్ | 19-04-2018 | 11:00am-1:00pm |
ఏపీ-లాసెట్ | 19-04-2018 | 3:00pm-4:30pm |
ఏపీ-ఎంసెట్(ఎంపీసీ) | 22-04-2018 నుండి 25-04-2018 వరకు | 9:00am-12:00pm & 2:30pm-4:00pm |
ఏపీ-ఎంసెట్ (బైపీసీ) | 26-04-018 | 9:00am-12:00pm & 2:30pm-4:00pm |
ఏపీ-ఐసెట్ | 02-05-2018 | 10:30am-12:30pm & 2:30pm-5:00pm |
ఏపీ-ఈసెట్ | 03-05-2018 | 10:00am-1:00pm |
ఏపీ-పీజీఈసెట్ | 10-05-2018 నుండి 12-05-2018 వరకు | 10:00am-12:00pm & 2:00pm-4:00pm |
ఏపీ-పీఈసెట్ | 04-05-2018 నుండి | 9:00am నుండి |