ఏపీలో మద్య నిషేదం దిశగా వేగంగా అడుగులు; సుంకం పెంచే యోచనలో జగన్ సర్కార్

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం ఏపీలో సంపూర్ణ మద్య నిషేదం విధించేందు దిశగా అడుగులు వేస్తున్నారు

Last Updated : Jul 25, 2019, 05:12 PM IST
ఏపీలో మద్య నిషేదం దిశగా వేగంగా అడుగులు; సుంకం పెంచే యోచనలో జగన్ సర్కార్

అమరావతి: సంపూర్ణ మద్య నిషేదం విధించే దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. దశల వారీగా మధ్య అమ్మాకాలను నిషేదం విధిస్తామన్న జగన్ ..అధికారంలోకి వచ్చి రాగానే  బెల్టుషాపులపై కొరడా ఝళిపించారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వామే నిర్వహించేలా చట్టం తీసుకొచ్చారు. అయితే ఇది అమలు కోసం కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు  తాజాగా మద్యంపై సుంకాలు పెంచి  ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ధరలు పెరిగితే జనాలు మద్యానికి దూరంగా ఉంటారని.. అమ్మాకాలు తగ్గే అవాకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

అక్కచెల్లిమ్మలకు జగన్ భరోసా !!

ఇదిలా ఉంటే  మద్య నిషేదం పై  ఏపీ  సీఎం వైఎస్ జగన్ ట్విట్ చేశారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన జగన్... అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను కాబట్టి దీన్ని అమల్లో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ...మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయని ట్విట్టర్ వేదికగా జగన్ పేర్కొన్నారు. 

 

ఆ లోటును ఎలా పూడ్చుతారు ?

రాష్ట్రంలో ప్రస్తుతం 4 వేలకుపైగా మద్యం దుకాణాలు ఉండగా..వాటి ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 20 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే నిషేదం అమలు చేస్తే ప్రభుత్వ రాబడికి గండి పడుతుంది. ఇప్పటికే రెవెన్యూ లోటుతో ఆర్ధికంగా నానా ఇబ్బుందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం...మద్యం నిషేదం వల్ల జరిగే ఆర్ధిక లోటు  ఎలా పూడ్చుతారనే ఆర్ధిక నిపుణుల నుంచి ప్రశ్నలు ఎదురౌతున్నాయి.

మద్య నిషేదానికి విపక్షాల మద్దతు !!

మద్య నిషేదంపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ స్వాగతిస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ  మద్య నిషేదాన్ని తాము కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అయితే మద్యం నిషేదం ఎంత వరకు అమలు చేస్తారనేదే ఇక్కడ అసలు ప్రశ్న అన్నారు. మద్య నిషేదం అమలు చేస్తే ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి... మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే మద్యం అమ్మేవారికి ప్రభుత్వ ఉద్యోగులగానే చూస్తారా అని ప్రశ్నించారు. ఇలా ఎన్నో విషయాల్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇటు బీజేపీ కూడా మద్య నిషేదాన్ని స్వాగతిస్తోంది.. దశల వారీగా కాకుండా ఒకే సారి నిషేదించాలని ఆ పార్టీ  నేతలు డిమాండ్ చేస్తున్నారు

Trending News