Remdesivir Demand: విశాఖపట్నం అడ్డాగా రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ దందా, ముంబైలోనూ అదే జోరు

Remdesivir Demand: కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏపీలోని విశాఖనగరం రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డాగా మారింది. అటు ముంబైలో కూడా భారీగా రెమ్‌డెసివిర్ వయల్స్ పట్టుబడ్డాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 21, 2021, 07:39 PM IST
Remdesivir Demand: విశాఖపట్నం అడ్డాగా రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ దందా, ముంబైలోనూ అదే జోరు

Remdesivir Demand: కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అందించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏపీలోని విశాఖనగరం రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డాగా మారింది. అటు ముంబైలో కూడా భారీగా రెమ్‌డెసివిర్ వయల్స్ పట్టుబడ్డాయి.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పంజా విసురుతోంది. మరోవైపు ఆక్సిజన్, బెడ్స్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత (Remdesivir Injections Shortage)వెంటాడుతోంది. ముఖ్యంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లైతే బ్లాక్ మార్కెట్‌లో తప్ప మరెక్కడా లభ్యం కావడం లేదు. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తుంటారు. ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు(Remdesivir injections) లభ్యం కావడం లేదు. విశాఖపట్నం అడ్డాగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ దందా ( Remdesivir injections black marketing) సాగుతోంది. ఇప్పటికే నగరంలోని ఓమ్ని ఆర్కే సిబ్బంది ఈ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తూ పట్టుబడ్డారు. మరోవైపు తాజాగా అక్కయ్యపాలెంలోని స్పెషాలిటీ ఫార్మా స్యూటికల్స్ అధినేత ఈశ్వరరావుపై ఇదే వ్యవహారపై విశాఖ ఔషధ నియంత్రణ శాఖ అదికారులు కేసు నమోదు చేశారు. బిల్లు ఇవ్వకుండానే 36 రెమ్‌డెసివిర్ వయల్స్‌ను అక్రమంగా కొందరికి విక్రయించినట్టు అధికారుల సోదాల్లో వెల్లడైంది. 

ఈ ఇంజక్షన్ వాస్తవానికి 5 వేల 4 వందలు కాగా..ఇటీవల కేంద్ర ప్రభుత్వం(Central government) ధరల్ని తగ్గించడంతో 2 వేల 5 వందలైంది. అయితే ఈశ్వరరావు ఒక్కో ఇంజక్షన్‌ను 7 వేలకు విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ముంబై ( Mumbai) లో కూడా రెమ్‌డెసివిర్ అక్రమ దందా సాగుతోంది. ముంబైలోని రెండు ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 2 వేల 2 వందల రెమ్‌డెసివిర్ వయల్స్ స్టాక్ పట్టుకున్నారు. దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్, సబర్బన్ అంధేరీల్లో ఈ దాడులు జరిగాయి.

Also read: Corona Second Wave: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు, ఆందోళనకరంగా మారుతున్న పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News