Amma Vodi, Vahana Mitra Schemes: ఏపీలో అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అవుతున్నాయా ? ఇందులో నిజమెంత ?

AP Government: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాల్ని రద్దు చేసినట్టు వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని..దుష్ర్పచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 2, 2022, 08:16 PM IST
  • జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాల రద్దు పుకార్లపై స్పందించిన ఏపీ ప్రభుత్వం
  • ఇదంతా ఫేక్ వార్తలని..దుష్ప్రచారాలు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక
  • ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలని..నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
Amma Vodi, Vahana Mitra Schemes: ఏపీలో అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అవుతున్నాయా ? ఇందులో నిజమెంత ?

AP Government: జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాల్ని రద్దు చేసినట్టు వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని..దుష్ర్పచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

గత కొద్దిరోజుల్నించి ఏపీలో 2022 ఏడాదికి జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర సంక్షేమ పథకాల్ని రద్దు చేయడం జరిగిందని..ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని,దీంతో.. ఈ ఏడాది జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సమాచార, సాంకేతిక ప్రసారాల మంత్రిత్వ శాఖ పేరుతో, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, అమరావతి రాజముద్రతో ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. నిజంగానే ప్రభుత్వం రెండు పథకాలను రద్దు చేస్తుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని..అసలు ఆంధ్రపదేశ్ సమాచార సాంకేతిస ప్రసారాల శాఖే రాష్ట్రంలో లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లేని శాఖపేరుతో తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని...దుష్ర్పచారం చేసేవారిని ఉపేక్షించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

2022 ఏడాదికి జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర సంక్షేమ పథకాల్ని రద్దు చేయడమనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం దారుణమని..రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలు, పుకార్లు సృష్టించేవారిపై చర్యలుంటాయని ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటిస్తూ..ఏ నెలకు ఆ నెల పథకాల లబ్దిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వమని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభ సమయంలో సైతం సంక్షేమ పథకాలు అమలు జరిగాయనే విషయాన్ని గుర్తు చేశారు. 

Also read: Divyavani Comments: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు..దివ్య వాణి సంచలన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News