Chandrababu Naidu Gets Anticipatory Bail in Angallu Case: అంగళ్లు దాడి కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి బిగ్ రిలీఫ్ లభించింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 79 మందికి ముందస్తు బెయిల్ లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లుపై దాడి కేసుల్లో బెయిల్ పిటిషన్లు, ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు నాయుడు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను డీమ్డ్ కస్టడీ కారణంగా తిరస్కరించగా.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ ప్రారంభ దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ తిరస్కరించింది. అంగళ్లు కేసులో బెయిల్ మంజూరు చేసింది.
ఆగస్టు నెలలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో చంద్రబాబు ర్యాలీ సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లర్లు జరిగాయి. ఈ దాడిలో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లు.. అధికార పార్టీకి చెందని వారే చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేశారని.. వ్యక్తిగత సిబ్బంది రక్షణ కల్పించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దాడి జరిగిన నాలుగు రోజుల తరువాత ఆలస్యంగా ఫిర్యాదు చేశారని.. జాప్యానికి గల కారణం వెల్లడించలేని వాదించారు.
ప్రభుత్వం తరుఫున అదనపు జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్ ప్రోద్భలంతోనే దాడులు జరిగాయని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేశారని అన్నారు. మాజీ సీఎంగా బాధ్యతగా వ్యహరించాల్సిందన్నారు. పిటిషనర్ చెప్పిన తరువాతే దాడులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో పోలీసులకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఇరువైపులా వాదనాలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెల్లడించారు.
ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా.. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త చంద్రబాబు నాయుడికి అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వ విఫలమైందని నారా భువనేశ్వరి అన్నారు. జైలులో సకాలంలో వైద్యం అందించలేదని.. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని చెప్పారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులన్నారని.. జైలులో ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని.. జైలులో పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందారు.
Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి