జాతీయ వృద్ధిరేటుకి ఏపీ రెట్టింపు ప్రగతి !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు స్థాయిలో ప్రగతి సాధించింది.

Last Updated : Dec 8, 2017, 03:10 PM IST
జాతీయ వృద్ధిరేటుకి ఏపీ  రెట్టింపు ప్రగతి !

అమరావతి: ఆర్ధిక సంవత్సర వృద్ధిరేటు ఫలితాల్లో ఏపీ సర్కార్ అద్భుత ఫలితాలను సాధించింది.  జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు ప్రగతి సాధించి రికార్డు  సృష్టించింది.  2017-18లో తొలి ఆరునెలల్లో జీవీఏ వృద్ధిరేటు జాతీయ స్థాయిలో 5.8శాతం ఉండగా.. ఏపీలో అది 11.37 శాతంగా నమోదయింది. వ్యవసాయంతో పాటు, పారిశ్రామిక, సేవారంగాలన్నింటిలోనూ ఇదే దూకుడుతో ముందుకు వెళ్లడం వలన.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టాప్‌లో నిలిచింది.  వృద్ధి రేటుకు సంబంధించిన ఫలితాలను ఇటీవలే ఏపీ సర్కార్ విడుదల చేసింది.

2015-16లో ఏపీ వృద్ధిరేటు 10.95 శాతం కాగా, జాతీయ వృద్ధిరేటు 8.01 శాతంగా నమోదైంది. 2016-17లో ఏపీ 11.61 శాతం వృద్ధిరేటు సాధిస్తే...జాతీయ సగటు 7.11 శాతం మాత్రమే. అలాగే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీవీఏ వృద్ధిరేటును పరిశీలిస్తే.. ప్రాథమికరంగంలో మత్స్యరంగం టాప్‌లో ఉంది. ఈ రంగంలో 43.43 శాతం వృద్ధిరేటు కనిపించింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసిక వృద్ధిరేటు 52.95 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అయితే వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి కనిపించింది. విధాన నిర్ణయాలతో పాటు నూతన పద్దతులను అవలంబించడం వల్లే ఇది సాధ్యపడిందని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.

Trending News