AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి గణనీయంగా తగ్గింది. గత నెల రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపులిచ్చారు. రేపట్నించి కేవలం నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది.
కరోనా సెకండ్ వేవ్‌తో(Corona Second Wave) విలవిల్లాడిన ఏపీ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కర్ఫ్యూ వేళల్లో మరింత సడలింపులిచ్చింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేపట్నించి కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ దుకాణాలు తెర్చుకుంటాయి. రాత్రి పది గంటల్నించి తిరిగి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది.
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2 వేల 591 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు 15 మంది మృతి చెందగా..ఇప్పటి వరకూ 13 వేల 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 3 వేల 329 మంది కోలుకోగా..ఇప్పటి వరకూ 18 లక్షల 87 వేల 670 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 25 వేల 957 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 32 లక్షల 20 వేల 912 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం(Ap government)సమాయత్తమవుతోంది.
Also read: AP Government: ఏపీ ప్రభుత్వం మరో ఘనత, ఇన్సూరెన్స్ ఉచిత వైద్యంలో దేశంలో టాప్ప్లేస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook