JOB Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, విశాఖలో పెద్దఎత్తున జాబ్ మేళా

JOB Mela: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. విశాఖలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈ జాబ్ మేళా జరగనుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2022, 08:36 AM IST
JOB Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్,  విశాఖలో పెద్దఎత్తున జాబ్ మేళా

JOB Mela: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. విశాఖలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈ జాబ్ మేళా జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. విశాఖపట్నంలో భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించనుంది. జనవరి 4వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు కంపెనీల్లో జాబ్ మేళాల్ని ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కొత్త ఏడాదిలో మొదటి జాబ్ మేళా ఇదే. ఈ జాబ్ మేళా వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 4వ తేదీ, 2022న విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఈ జాబ్ మేళా (Job Mela) జరగనుంది. క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 4 కంపెనీలు పాల్గొననున్నాయి.పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు పదవ తరగతి అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండాలి. వయస్సు 19-35 ఏళ్ల వరకూ ఉండవచ్చు. ఇక జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగాలకు డిప్లొమో ఇన్ మెకానికల్ , ఐటీఐ మోటార్ మెకానికల్ లేదా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. వయస్సు 19-28 ఏళ్ల వరకూ ఉండవచ్చు. ఇక పత్ర కంపెనీలో ప్రోసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఏదైనా డిగ్రీ, మూడేళ్ల డిప్లొమో పూర్తి చేసి ఉండాలి. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్ వేర్ ట్రైనీ లేదా యూఎస్ ఐటీ బిజినెస్ డివలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీటెక్ లేదా ఎంసీఏ విద్యార్హతగా ఉంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఏపీఎస్ఎస్‌డీసీ అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 

Also read: Sankranthi Special Trains: సంక్రాంతికి 10 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News