Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు

Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఇప్పుడు మరో టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2021, 03:33 PM IST
  • అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు అందించిన సీఐడీ
  • అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో నారాయణను ఏ2గా చేర్చిన సీఐడీ
  • ఈ నెల 22వ తేదీ ఉదయం విచారణకు హాజరుకావాలని సూచించిన సీఐడీ
 Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు

Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఇప్పుడు మరో టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది. 

అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూకుంభకోణం (Amaravati land scam) కేసు విచారణలో సీఐడీ వేగం పెంచింది. భూకుంభకోణం కేసులో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించిన తరువాత సీఐడీ విచారణ ప్రారంభించింది. ముందుగా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి ( Chandrababu) కి నోటీసులు జారీ చేసింది సీఐడీ. ఇప్పుడు ఏ2గా మాజీ మంత్రి నారాయణ ( Ex minister Narayana) పేరును చేర్చిన ఏపీసీఐడీ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం నేత నారాయణ అందుబాటులో లేనికారణంగా ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందించింది. ఈ నెల 22 ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణపై సెక్షన్‌లు 166, 167, 217 ప్రకారం కేసులు నమోదు చేసింది. 

మరోవైపు నారాయణ విద్యాసంస్థలు, కార్యాలయాలు, నివాసంలో సీఐడీ సోదాలు (CID Raids) నిర్వహించింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఎవరినీ లోపలకు అనుమతించలేదు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లలో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. 

Also read: Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీలు పోటీ చేస్తాయా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News