Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీలు పోటీ చేస్తాయా

Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో తిరుపతి నుంచి ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ-జనసేనలు తేల్చుకోలేకపోతున్నాయని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 17, 2021, 12:29 PM IST
  • తిరుపతి ఉపఎన్నిక విషయంలో ప్రతిపక్ష పార్టీల్లో పెరిగిన టెన్షన్
  • తిరుపతి లోక్‌సభ నుంచి పోటీకు విముఖత ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి
  • తిరుపతి సీటు విషయంలో తేల్చుకోలేకపోతున్న జనసేన-బీజేపీ
Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికలో ఆ పార్టీలు పోటీ చేస్తాయా

Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో తిరుపతి నుంచి ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ-జనసేనలు తేల్చుకోలేకపోతున్నాయని తెలుస్తోంది.

ఏపీలో ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఫలితాలు ( Municipal Election Results) అధికార పార్టీకు ప్రజల్లో ఉన్న పట్టును నిరూపించాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( Ysr congress party ) క్లీన్‌స్వీప్ చేయడం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు మింగుడుపడని పరిణామంగా మారింది. తిరుపతి కార్పొరేషన్ సహా లోక్‌సభ పరిధిలోని మున్సిపాలిటీలు అన్నింటినీ చేజిక్కించుకోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపుతో ఉంది. మెజార్టీ లెక్కలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ నేతలు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పుకోవచ్చు.

తిరుపతి లోక్‌సభ ( Tirupati loksabha) స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని గతంలోనే ప్రకటించినా ఆమె పోటీ చేస్తారనేది అనుమానాస్పదంగానే ఉంది. ముందు నుంచీ పనబాక లక్ష్మి తిరుపతి ఉపఎన్నికలో( Tirupati Bypoll) పోటీకు విముఖంగా ఉన్నారని సమాచారం. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో  ఈ అనుమానాలు మరింతగా పెరిగాయి. పోటీ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ పనబాక లక్ష్మి తప్పుకుంటే మరో అభ్యర్ధి ఎవరనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.  ఇప్పటికిప్పుడు పార్టీ అభ్యర్ధి ఎవరనేది చెప్పడం కష్టమేనని పార్టీవర్గాలే చెబుతున్నాయి. 

అటు బీజేపీ-జనసేన ( Bjp-Janasena) పార్టీల పరిస్థితి అలాగే ఉంది. తిరుపతి సీటు కోసం రెండు పార్టీలు పట్టుబట్టాయి మొన్నటి వరకూ. ఇప్పడు పరిస్థితి మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రెండు పార్టీలకు పోలైన ఓట్లు చూసి వెనుకంజ వేస్తున్నారని సమాచారం. పొత్తులో భాగంగా తొలుత జనసేనకు తిరుపతి స్థానం కేటాయించవచ్చని అనుకున్నారు. తరువాత బీజేపీనే పోటీ చేస్తుందనే ప్రచారం సాగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు కూడా విన్పించింది. మరోవైపు నిన్న స్థానికంగా సమావేశమైన జనసేన శ్రేణులు బీజేపీకు ఓటేయకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే ఈ తాజా పరిణామాలకు కారణంగా తెలుస్తోంది. 

Also read: Tirupati By Elections: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో 3 లక్షల మెజార్టీతో గెలుస్తాం : మంత్రి పెద్దిరెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News