Big Breaking:ఏపీ లో ఘోరం.. విద్యుత్ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి.. అసలేం జరిగిందంటే..?

Tragedy in East Godavari :తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరం జరిగింది. నలుగురు యువకులు.. విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాం కోసం ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘోరం జరిగినట్టు సమాచారం. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 4, 2024, 09:21 AM IST
Big Breaking:ఏపీ లో ఘోరం.. విద్యుత్ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి.. అసలేం జరిగిందంటే..?

AP Breaking News: ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో.. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా..  అక్కడ పనుల్లో నిమగ్నమైన యువకులు ప్లెక్సీలు కడుతూ దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్కుకి గురై అక్కడికక్కడే మృతి చెందారు. 

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడుపర్రు గ్రామంలో ఫ్లెక్సీలు కడుతూ ఉండగా.. విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనిలో బొల్లా వీర్రాజు (25), కాశ గాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య (29). పలువురు యువకులు నిమగ్నమయ్యారు. 

అయితే ఈ నలుగురు యువకులు కూడా ఫ్లెక్సీ ని కట్టే క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి నలుగురు యువకులు కూడా షాక్ కి గురయ్యారు. పక్కనే ఉన్న స్థానికులు గమనించి వీరిని రక్షించే లోపే వీరు అక్కడే తుదిశ్వాస విడిచారు. అలాగే ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. తణుకు ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?

 

ఇకపోతే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని పరిశీలించారు ఇకపోతే ఫ్లెక్సీలు కడుతూ నలుగురు యువకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాడుపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ ముందు నుంచే వివాదాల మయం అయింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి.

చివరికి జిల్లా కలెక్టర్ , ఆర్డీవో,  మంత్రి కందుల దుర్గేష్,  పలువురు అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించి ఎట్టకేలకు సోమవారం రోజున విగ్రహ ఆవిష్కరణ , అన్న సమారాధన చేయాలి అని అనుకున్నారు. అందుకు  ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ ఘటన జరగడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: KTR Padayatra: ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్‌.. పాదయాత్ర చేసేది అక్కడి నుంచే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

 

 

 

 

 

 

 

Trending News