అది బాబు తప్పే..మా తప్పు కాదు - పురందేశ్వరీ

బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత పురందేశ్వరీ స్పందించారు.

Last Updated : Mar 9, 2018, 11:56 AM IST
అది బాబు తప్పే..మా తప్పు కాదు - పురందేశ్వరీ

ఏపీలో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ నేత పురందేశ్వరీ స్పందించారు. విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో కేంద్రంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె వివరణ ఇచ్చారు.  ప్రత్యేక హోదాతో ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదని..ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి ఎక్కువ లాభం ఉంటుందనే కోణంలో ఆయన మాట్లాడారని వెల్లడించారు. జైట్లీ వ్యాఖ్యలను చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటే అది మా తప్పు ఎలా అవుతుందని పురందేశ్వరీ ప్రశ్నించారు.

కేంద్రం చొరవతోనే రాష్ట్రంలో పెట్టుబడులు

 జైట్లీ వ్యాఖ్యలు వక్రీకరించడం శోచనీయని పురందేశ్వరీ పేర్కొన్నారు. అసలు ఏపీకి సాయం అందించమని కేంద్రం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పిందా అని ఆమె ప్రశ్నించారు.  కేంద్రం చొరవతోనే ఏపీలో పెట్టుబడలు పెరిగాయని..వారు ఇస్తున్న డబ్బుతోనే రాష్ట్రంలో అభివద్ది జరుగుతోంది. ఆర్ధిక లోటు ను పూడ్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి   రూ 2 వేల 500 కోట్లు ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఏపీకి నిధుల విడుదల విషయంలో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవేమని.. అంత మాత్రాన ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని భావించాల్సిన అవసరం లేదని పురందేశ్వరీ పేర్కొన్నారు

Trending News