'కరోనా వైరస్'ను ధీటుగా ఎదుర్కోవాలంటే .. ఇన్ఫెక్షన్ సోకిన వారిని దూరంగా ఉంచాలి. మరి అలాంటి లక్షణాలు ఉన్న వారిని ఏం చేయాలి. అందుకే వారిని 14 రోజులపాటు క్వారంటైన్లలో ఉంచుతారు. తరచుగా వారిని మెడికల్ అబ్జర్వేషన్లలో ఉంచుతారు. ఒకవేళ వారి రిపోర్టులు 'పాజటివ్' గా వస్తే ఆస్పత్రికి తరలిస్తారు. లేనిపక్షంలో ఇంటికి పంపిస్తారు.
అలాంటి క్వారంటైన్ సెంటర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలిశాయి. తాత్కాలికంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వారికి ప్రభుత్వాలే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వేళకు భోజనం పెడుతున్నాయి. 14 రోజులపాటు వారిని పరిశీలించిన తర్వాత బయటకు పంపాలా.. ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు.
నిజానికి కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు ముందు నుంచే చెబుతున్నాయి. దీనికి కారణమేంటంటే .. రోగ నిరోధక శక్తి ఉన్న వారు కరోనా వైరస్ నుంచిసులభంగా బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ సెంటర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ క్వారంటైన్ సెంటర్ లో బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నారు. పూట పూటకు తాజా పండ్లు, డ్రై ఫ్రూట్లు, గుడ్లు అందిస్తున్నారు. క్వారంటెన్ లో ఉన్న వారికి త్వరగా రోగ నిరోధక శక్తి సమకూరేందుకే ఇలా చేస్తున్నామని క్వారంటైన్ నిర్వాహకులు తెలిపారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'గోరుముద్ద' పథకం కింద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతే కాదు మిగతా క్వారంటైన్ సెంటర్లు ఈ పద్ధతి పాటించాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్వారంటైన్‌లో బలవర్ధక ఆహారం.. ఎక్కడో తెలుసా..?