మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితా రిలీజ్; తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సముచిత స్థానం

దేశంలో అత్యంత ప్రజాదరణ కల్గిన ముఖ్యమంత్రుల జాబితాను వీపీడీ అసోషియట్స్ సంస్థ బయటపెట్టింది.

Last Updated : Aug 15, 2019, 11:45 PM IST
మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితా రిలీజ్; తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సముచిత స్థానం

ప్రజాఆదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సముచిత స్థానం దక్కింది. జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఓ సర్వేలో ఏపీ సీఎం జగన్ మూడో స్థానం దక్కించుకోగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఐదో స్థానం దక్కింది. పాలన పట్ల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ మేరకు ర్యాంకులు విడుదల చేశారు.

'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఈ సర్వేలో తీసుకున్న శాంపిల్ లో జగన్  పాలన పట్ల 71 శాతం  సంతృప్తి వ్యక్తం చేయగా కేసీఆర్ పాలన పట్ల 65 శాతం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తేలింది. ఏఫీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు  పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. అలాగే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజల తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. 

మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితాలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ గా నిలిచారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  రెండో స్థానం దక్కించుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 60 శాతం ప్రజల ఆమోదం పొంది ఏడో స్థానంలో నిలిచారు. ఇక  ఫైర్ బ్యాండ్ ముఖ్యమంత్రులైన  మమత బెనర్జీ (54 శాతం) కు 11 స్థానం.. నితీష్ కుమార్ (52 శాతం) కు 12 స్థానంతో దక్కడం గమనార్హం.ఇదిలా ఉంటే దక్షినాదిన తెలుగు రాష్రాల ముఖ్యమంత్రులకే టాప్ 10 లో స్థానం దక్కడం గమనార్హం
 

మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో టాప్ 10లో స్థానం దక్కించుకున్న ముఖ్యమంత్రులు జాబితాను ఒక్క సారి పరిశీలిద్దాం..
1.నవీన్ పట్నాయక్         ( ఒడిషా )              : 81 శాతం
2.యోగి ఆధిత్యనాత్       (యూపీ)                : 72 శాతం
3.వైఎస్ జగన్                 ( ఏపీ )                   : 71 శాతం
4.మనోహర్ లాల్ కట్టర్  ( హర్యానా)             : 68 శాతం
5.కే.చంద్రశేఖర్ రావు     (తెలంగాణ )          : 65 శాతం
6.అమరేంద్ర సింగ్         ( పంజాబ్    )        : 62 శాతం
7.అరవింద్ కేజ్రీవాల్      ( ఢిల్లీ )                 : 60 శాతం
8. విజయ్ రూపానీ           (  గుజరాత్     )     : 59 శాతం
9. రఘుబార్ దాస్           ( ఝార్ఖండ్     )     : 57 శాతం
10. కమల్ నాథ్               (మధ్యప్రదేశ్ )     : 54 శాతం

 

 

Trending News