పసుపు-కుంకుమకు లైన్ క్లియర్; పథకం అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్

పసుపు కుంకుమ పథకం అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు సర్కార్ కు ఉరట కల్గింది.

Last Updated : Apr 3, 2019, 08:48 PM IST
పసుపు-కుంకుమకు లైన్ క్లియర్; పథకం అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్

పసుపు-కుంకుమ నగదు విడుదలకు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయినందున పథకం అమలుకు ఇబ్బంది లేదని...దీనికి ఎన్నికల కోడ్ అడ్డు రాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ అనుమతి రావడంతో   ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకం కింద మూడో విడత కింద రూ.3900 కోట్లు విడుదల చేసింది.

పసుపు-కుంకుమ పథకం పేరుతో ఏపీ సర్కార్ ...డ్వాక్రా మహిళలకు రూ.10 వేల సాయం ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతగా రూ.2500, రెండో విడతగా రూ.3500 ప్రభుత్వం అందించింది. అయితే మూడో విడతగా రూ.4 వేలు అందించాల్సి ఉండగా పథకం నిలిపివేత కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు పరిశీలించిన ఈసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Trending News