Actress Anshu Video: సైజులు పెంచాలన్న డైరెక్టర్.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్ అన్షు.. ఏమన్నారంటే..?

Anshu on  Trinadha rao comments: నటి అన్షు మజాకా టీజర్ రిలీజ్ వేళ చోటు చేసుకున్న కాంట్రవర్సీ అంశాలపై ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 13, 2025, 07:57 PM IST
  • త్రినాథ రావు వ్యాఖ్యలపై స్పందించిన నటి..
  • దయచేసి వదిలేయాలని రిక్వెస్ట్..
Actress Anshu Video: సైజులు పెంచాలన్న డైరెక్టర్.. షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన హీరోయిన్ అన్షు.. ఏమన్నారంటే..?

Actress anshu on trinadha rao mazaka teaser comments: మన్మథుడు ఫెమ్ అన్షు తాజాగా.. డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. ఇటీవల మజాకా మూవీ టీజర్ విడుదల నేపథ్యంలో త్రినాథ రావు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీనిపై ఏకంగా తెలంగాణ మహిళ కమిషన్ సైతం.. సుమోటోగా స్వీకరించి.. డైరెక్టర్ కు నోటీసులు జారీచేసింది. ఈనేపథ్యంలో నటి అన్షు విడుదల చేయడం  ప్రాధాన్యత సంతరించుకుంది.

Add Zee News as a Preferred Source

అన్షు మాట్లాడుతూ.. డైరెక్టర్ ఈ మూవీలో షూటింగ్ నేపథ్యంలో తనను ఇంట్లో వాళ్లలాగా చూసుకున్నారని... ఏరోజుకూడా ఏ విషయంలోను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. ఆయన చాలా మంచి వారన్నారు.  తన సెకంట్ ఇన్నింగ్స్ కోసం ఆయన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారని.. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కూడా నటి అన్షు మాట్లాడారు.

 

తనకు ఈ ఘటనపై చాలా మెస్సెజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చాయని.. అదే విధంగా ఈ మూవీ టిజర్ బాగుందని కూడా చాలా మంది మెస్సెజ్లు చేశారన్నారు. ప్లీజ్ దయచేసి.. ఇక మీదట దీన్ని వదిలేయాలని కూడా చెప్పారు. అంతేకాకుండా.. అభిమానులందరికి కూడా సంక్రాంతి విషేస్ చెప్పారు.

Read more: Mazaka Movie controversy: మా ఇంట్లోను ఆడవాళ్లున్నారు.. దయచేసి క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన త్రినాథరావు..

ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ ఘటనపై డైరెక్టర్ త్రినాథ రావు కూడా.. సారీ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండ.. కావాలని అలా అనలేదని.. ఏదో అనుకొకుండా జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో నటి అన్షు కూడా వీడియో రిలీజ్ చేయడంతో ఈ కాంట్రవర్సీకి ఇంతటితో బ్రేక్ పడినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News