Fire Accident in Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakha Steel Plant)లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ల్యాడిల్‌కు రంధ్రం పడడంతో ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో రెండు లారీలు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో 50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదాలు జరిగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ (visakha steel plant)ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటీకరణ (Privatization)కు వ్యతిరేకంగా కార్మికులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఉక్కు కార్మికులకు మద్దతు ప్రకటించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook