Bus Charges Hike : విద్యార్థులను వదలని ఆర్టీసీ.. బస్‌ పాస్‌ చార్జీలు 150 శాతం హైక్

TSRTC : బాదుడే బాదుడు..తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పాలసీ ఇప్పుడు ఇదే అనిపిస్తోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాలు.. ప్రజలపై ఎడాపెడా పన్నులు వేస్తున్నాయి.ఎక్కడ దొరికితే అక్కడ భారం వేస్తున్నాయి.ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసీ మరీ దూకుడుగా వెళుతోంది.

Written by - Srisailam | Last Updated : Jun 10, 2022, 12:37 PM IST
  • బస్ పాస్ చార్జీలను పెంచిన టీఆర్ఆర్టీసీ
  • అన్ని రకాల పాసులపై భారీగా బాదుడు
  • ఏటా 180 కోట్ల రూపాయల భారం
Bus Charges Hike : విద్యార్థులను వదలని ఆర్టీసీ.. బస్‌ పాస్‌ చార్జీలు 150 శాతం హైక్

TSRTC : బాదుడే బాదుడు.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పాలసీ ఇప్పుడు ఇదే అనిపిస్తోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాలు.. ప్రజలపై ఎడాపెడా పన్నులు వేస్తున్నాయి. ఎక్కడ దొరికితే అక్కడ భారం వేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ఆర్టీసీ మరీ దూకుడుగా వెళుతోంది. ఇటీవల కాలంలో బసు చార్జీలను భారీగా పెంచేసింది టీఎస్ ఆర్టీసీ. డీజిల్ సెస్ పేరుతో భారీగా చార్జీలు పెంచింది. రెండు నెలల్లోనే ఆర్టీసీ బసు చార్జీలు రెండింతలు అయ్యాయంటే బాదుడు ఎలా ఉందో ఊహించవచ్చు. తాజాగా డీజిల్ సెస్ పేరుతో మరోసారి చార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. విద్యార్థులను కూడా వదల్లేదు.

స్టూడెంట్స్ బస్ పాస్ చార్జీలను భారీగా పెంచింది తెలంగాణ ఆర్టీసీ. ఏకంగా 150 శాతం హైక్ చేసింది. ఇప్పటివరకు 165 రూపాయలుగా ఉన్న స్టూడెంట్ బస్ పార్ చార్జీని ఏకంగా 4 వందల రూపాయలు చేశారు. జనరల్ పాస్ మూడు నెలల పాస్ ధర 495 నుంచి 12 వందల రూపాయలకు పెరిగింది. స్టూడెంట్ గ్రేటర్ పాస్ రేటు 165 రూపాయల నుంచి 4 వందలకు పెరిగింది. దీనిపై ప్రతి రెండు కిలోమీటర్లకు 70 రూపాయలు అదనం.  స్టూడెంట్ జనరల్ స్పెషల్ పాస్ ఇప్పటివరకు 260 రూపాయలు ఉండగా.. ఇకపై 450 రూపాయలు. స్టూడెంట్ జనరల్ స్పెషల్ పాస్ మూడు నెలలకు ప్రస్తుతం 780 రూపాయలు ఉండగా... పెరిగిన ధరలతో ఏకంగా 1350 రూపాయలకు చేరింది. ప్రతి రోజు ఒకే మార్గంలో తిరిగే విద్యార్థులు తీసుకునే రూట్ పాస్ ధర 8 కిలోమీటర్ల వరకు ఇప్పటివరకు 2 వందల రూపాయలు ఉండగా.. అది ఇప్పుడు ఏకంగా 6 వందల రూపాయలకు పెరిగింది.

కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా కాలేజీలు సరిగా రన్ కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నాయి. కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే బస్ పాస్ చార్జీలను భారీగా పెంచేసి విద్యార్థులపై భారం మోపింది ఆర్టీసీ. పెరిగిన చార్జీలతో విద్యార్థులు హడలిపోతున్నారు. పేద, మద్యతరగతి విద్యార్థులకు పెరిగిన బస్ పాస్ చార్జీలు భారంగా మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు బస్ పాస్ వినియోగిస్తున్నారు. గ్రేటర్ పాసులతో పాటు నగర శివారు వరకే ప్రయాణించే పాసులు కూడా ఉన్నాయి. ప్రతి నెలా విద్యార్థుల బస్ పాసులతో ఆర్టీసీకి 8 కోట్ల రూపాయల అదాయం వస్తుంది. పెరిగిన చార్జీలకు ఇకపై నెలకు 15 కోట్ల రూపాయలు రానుంది. తాజా పెంపుతో విద్యార్థులపై ఏటా 180 కోట్ల రూపాయల భారం పడనుంది. ఈనెల 15 నుంచి విద్యార్థులకు కొత్త పాస్ లు ఇవ్వనున్నారు. పెరిగిన చార్జీల ప్రకారమే కొత్త పాసులు జారీ చేయనుంది తెలంగాణ ఆర్టీసీ.  

Read also: KCR MEETING: సాయంత్రం కేసీఆర్ కీలక సమావేశం.. సంచలనం జరగబోతోందా?  

Read also: Covid-19 Fourth Wave: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x