AP: చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి.. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో..ఎవరిపై ఏం వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. మనస్సులో ఏం దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారని అంటారు. ఇప్పుడు చంద్రబాబుపై మండిపడ్డారు.

Last Updated : Jan 16, 2021, 11:05 PM IST
AP: చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి.. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో..ఎవరిపై ఏం వ్యాఖ్యలు చేస్తారో తెలియదు. మనస్సులో ఏం దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారని అంటారు. ఇప్పుడు చంద్రబాబుపై మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ ( Telugu Desam party ) అధినేత చంద్రబాబునాయుడి ( Chandrababu naidu )ని టార్గెట్ చేశారు అదే పార్టీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. మనసులో ఏం దాచుకోకుండా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఇప్పుడు చంద్రబాబు వైఖరిపై మండిపడుతూ విమర్శలు చేశారు. అపార రాజకీయానుభవమున్న చంద్రబాబు ఇప్పటికైనా మారాలని..లేకపోతే మరోసారి జగన్ ( Ys jagan ) చేతిలో చావుదెబ్బ తినక తప్పదంటూ హాట్ కామెంట్స్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి ( Jc Diwakar reddy ). పార్టీలోని అందరి మనస్సుల్లో ఇదే ఉన్నా..తాను పైకి చెబుతున్నానన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడుూ..ఇప్పుడూ అదే వైఖరి అవలంభిస్తున్నారని జేసీ విమర్శించారు. ఏదైనా విషయాన్ని గంటల తరబడి సాగదీయడం చంద్రబాబు ( Chandrababu ) మార్చుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా గంటల తరబడి సమీక్షల పేరుతో సమయం వృధా చేసేవారన్నారు. కలిసేందుకు ఎవరైనా వస్తే...యోగక్షేమాలు, కుటుంబం బాగోగులు ఎప్పుడూ అడగడరని చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ ( NTR ) , వైఎస్ఆర్ ( YSR ) లాంటి నేతలైతే ఎవరైనా కలవడానికి వెళ్లినప్పుడు భుజంపై చేయేసి..కుటుంబ వివరాలు, యోగక్షేమాలు అన్నీ తెలుసుకుంటారని..ఆ తరువాతే ఏ పని మీద వచ్చారో అడిగేవారని జేసీ తెలిపారు. 

ఇదే విషయాన్ని చంద్రబాబుకు తాను వ్యక్తిగతంగా, బహిరంగంగా చెప్పినా మార్పు రాలేదన్నారు. మున్ముందు ఆయనలో మార్పు వస్తుందన్న నమ్మకం కూడా లేదని నిష్టూరమాడారు. తానొక్కడే సీనియర్..మిగిలినవాళ్లంతా చిన్నపిల్లలనే ధోరణి చంద్రబాబుదని  జేసీ తెలిపారు. ఈ ధోరణి మానుకోవాలని హితవు పలికారు. 

Also read: AP: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x