సినీ నటుడి కారు ఢీకొని మహిళ మృతి.. నటుడికి గాయాలు!

సినీ నటుడి కారు ఢీకొని మహిళ మృతి.. నటుడికి గాయాలు!

Last Updated : Apr 27, 2019, 05:30 PM IST
సినీ నటుడి కారు ఢీకొని మహిళ మృతి.. నటుడికి గాయాలు!

గుంటూరు : శేఖర్‌ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమా చూసిన వాళ్లకు ఎవరికైనా ఆ సినిమాలో నాగరాజు అనే యువకుడి పాత్రతో నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన సుధాకర్ కోమాకుల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన తొలి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుధాకర్ కోమాకుల ప్రస్తుతం నువ్వు తోపురా అనే సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. సుధాకర్ కోమాకుల హీరోగా వచ్చే నెల విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే హైదరాబాద్ నుంచి గుంటూరు బయల్దేరిన అతడి కారు మంగళగిరి మండలం చినకాకాని వద్ద ప్రమాదానికి గురైంది. 

జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సుధాకర్ కోమాకుల కారు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న సుధాకర్‌ కోమాకులతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా వచ్చిన సుధాకర్ కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Trending News