Margadarsi Case: మార్గదర్శి కేసులో కొత్త ట్విస్ట్, నిధులు మళ్లించిన 40 సంస్థల్లో డీమార్ట్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ

Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపెడుతోంది ఏపీసీఐడీ. ఇప్పటికే ఆ సంస్థ ఆస్థుల్ని సీజ్ చేసిన సీఐడీ..చందాదారుల డబ్బుల్ని ఎక్కడెక్కడికి మళ్లించిందో గుర్తించింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 15, 2023, 10:10 PM IST
Margadarsi Case: మార్గదర్శి కేసులో కొత్త ట్విస్ట్, నిధులు మళ్లించిన 40 సంస్థల్లో డీమార్ట్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ

Margadarsi Case: జనం డబ్బుతో వ్యాపారం చేసి మార్గదర్శి సంస్థ చిట్‌ఫండ్స్ నిబంధనల్ని ఉల్లంఘించిందనే ఆరోపణల్ని ఏపీసీఐడీ పగడ్బంధీగా రుజువు చేస్తోంది. ఇప్పటికే మార్గదర్శికి చెందిన 793,50,72,460 కోట్ల రూపాయల్ని సీజ్ చేసిన సీఐడీ మరో 242 కోట్ల విలువైన ఆస్థుల్ని ఎటాచ్ చేసింది. మరోవైపు ఎక్కడెక్కడ జనం చిట్ డబ్బుల్ని మళ్లించిందో గుర్తించింది. 

ప్రముఖ దినపత్రిక ఈనాడుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్..చిట్‌ఫండ్ కార్యకలాపాల మార్గదర్శకాలు, నిబంధనల్ని ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌లను ఏ1, ఏ2లుగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. రామోజీరావును సైతం కొన్ని గంటలపాటు విచారించింది. తాజాగా మార్గదర్శి ఆస్థుల్ని పెద్దఎత్తున జప్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగించి కీలకమైన డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సీఐడీ మరి కొన్ని ఆస్థుల్ని స్వాధీనం చేసుకుంది. రామోజీరావు ఆస్థుల్ని ఎటాచ్ చేసినట్టు రాష్ట్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్థుల స్వాధీనానికి సంబంధించి జీవో నెంబర్ 116 జారీ చేసింది. 

చిట్‌ఫండ్ డబ్బుల్ని వివిధ సంస్థలకు మళ్లించి పెట్టుబడులు పెట్టిందనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల్ని నిజం చేస్తూ ఎక్కడెక్కడ, ఏయే సంస్థలకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ డబ్బుల్ని మళ్లించిందో మొత్తం 40 సంస్థల పేర్లను జీవో నెంబర్ 116లో వివరించింది. మార్గదర్శి సంస్థ చిట్ డబ్బుల్ని మళ్లించిన సంస్థల్లో ప్రధానంగా డీమార్ట్, భారతీ ఎయిర్‌టెల్, సెంచరీ టెక్స్‌టైల్స్ సంస్థలు ఉన్నాయి. 

వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆదిత్య బిర్లా కేపిటల్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్స్, హెచ్‌డీఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, నేషనల్ హైవే అథారిటీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, నిప్పన్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా కేపిటల్స్ ఫైనాన్స్ సర్వీసెస్, టాటా కెమికల్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వ్యాన్‌టెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలున్నాయి.

Also read: AP ICET 2023: ఏపీ ఐసెట్ 2023 ఫలితాలు విడుదల, ఇలా cets.apsche.ap.gov.in. చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News