AP ICET 2023: ఏపీలోని వివిధ యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్ 2023 ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ఇవాళ విడుదల చేసింది. రేణిగుంట విద్యార్ధి టాప్ ర్యాంక్‌లో సాధించగా రెండవ ర్యాంకును తెలంగాణకు చెందిన విద్యార్ధి దక్కించుకున్నాడు.
ఏపీ ఐసెట్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 24వ తేదీన శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ ఈ పరీక్షను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 49, 162 మంది దరఖాస్తు చేసుకోగా, 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలు, కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మే 24 ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ, తిరిగి మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ రెండు దశల్లో పరీక్ష జరిగింది.
ఐసెట్ పరీక్ష రాసిన విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in.లో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు. ర్యాంక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ ఐసెట్ 2023 టాప్ 10 ర్యాంకర్లను ప్రకటించింది.
రేణిగుంటకు చెందిన టి జగదీశ్ కుమార్ రెడ్డి మొదటి ర్యాంకును, సికింద్రాబాద్‌కు చెందిన వి సాయి వెంకట కార్తీక్ రెండవ ర్యాంకు, అనంతపురంకు చెందిన పి రోహిత్ మూడవ ర్యాంకు సాధించారు. ఇక విజయనగరంకు చెందిన సీహెచ్ జ్యోతి స్వరూప్ నాలుగవ ర్యాంక్, విశాఖపట్నంకు చెందిన కే రేవంత్ ఐదవ ర్యాంక్, పశ్చిమ గోదావరికి చెందిన మొహమ్మద్ ఆఫ్తాద్ ఉద్దీన్ 6వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఇక విశాఖపట్నంకు చెందిన డి దేవ్ అభిషేక్ 7వ ర్యాంక్, కాకినాడకు చెందిన జమ్ము ఫణీంద్ర 8వ ర్యాంక్, బాపట్లకు చెందిన పి రోహన్ 9వ ర్యాంక్, పశ్చిమ గోదావరికి చెందిన ఏ మహాలక్ష్మి 10వ ర్యాంక్ సాధించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
Also read: Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook