Woman Catches Chain Snatcher: చాకచక్యంగా చైన్ స్నాచర్‌‌ని పోలీసులకు పట్టిచ్చిన మహిళ

Woman Catches Chain Snatcher: చైన్‌ని లాక్కు వెళ్లే క్రమంలో సగం చైన్ దొంగ తెంపుకుని వెళ్లగా.. మరో సగం ఉమాశ్రీ వద్దే మిగిలి ఉంది. అయితే, పట్టుబడిన దొంగ ఫోన్ నుంచి పారిపోయిన దొంగకు ఫోన్ చేయగా.. మొదట చైన్ తెచ్చి ఇస్తానని చెప్పిన మరో దొంగ.. ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.

Written by - Pavan | Last Updated : Jan 22, 2023, 08:27 AM IST
Woman Catches Chain Snatcher: చాకచక్యంగా చైన్ స్నాచర్‌‌ని పోలీసులకు పట్టిచ్చిన మహిళ

Woman Catches Chain Snatcher: నెల్లూరు బాలాజీ నగర్‌లో గురువారం రాత్రి  చైన్ స్నాచింగ్‌కి పాల్పడిన దొంగను బాధిత మహిళ పట్టుకుంది. బాలాజీ నగర్‌కి చెందిన ఉమశ్రీ అనే మహిళ బెంగుళూరు వెళ్తున్న తన కుమారుడిని బస్టాండుకు ఆటో ఎక్కించి తిరిగి వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, వెంటనే అప్రమత్తమైన మహిళ.. దొంగలతో ప్రతిఘటించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు దొంగల్లో ఒకరిని పట్టుకోగలిగారు. స్థానికులు, చుట్టుపక్కల వారు కూడా సమయానికి ఆమెకు సహాయంగా రావడంతో పారిపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లలో ఒకడిని పట్టుకోవడం తేలికైంది.  

చైన్‌ని లాక్కు వెళ్లే క్రమంలో సగం చైన్ దొంగ తెంపుకుని వెళ్లగా.. మరో సగం ఉమాశ్రీ వద్దే మిగిలి ఉంది. అయితే, పట్టుబడిన దొంగ ఫోన్ నుంచి పారిపోయిన దొంగకు ఫోన్ చేయగా.. మొదట చైన్ తెచ్చి ఇస్తానని చెప్పిన మరో దొంగ.. ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. అనంతరం స్థానికుల సహాయంతో పట్టుబడిన దొంగను బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. 

ఉమాశ్రీ రాజు పాలెంలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉమాశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో దొంగను కూడా మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోవడం విశేషం. పట్టుబడిన ఇద్దరు దొంగలను స్థానికులేనని పోలీసులు తెలిపారు. అతడి నుంచి సగం చైన్ ని రికవరీ చేసిన పోలీసులు.. కోర్టు ద్వారా దానిని తిరిగి ఉమాశ్రీకి అందిస్తామని తెలిపారు. మొత్తానికి ఉమాశ్రీ సమయస్పూర్తి, స్థానికుల చాకచక్యంతో దొంగను పట్టుకోవడంతో చైన్ స్నాచర్స్ ఇద్దరూ పట్టుబడ్డారు.

ఇది కూడా చదవండి : Vastu Tips : లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇలా పెడితే వద్దన్నా ధనం వచ్చిపడుతుందట

ఇది కూడా చదవండి : How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట

ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News