Modi Chocolates: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూతురికి మోదీ చాక్లెట్లు...

Modi chocolates to MP Ram Mohan Naidu's Daughter: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇవాళ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 08:45 PM IST
Modi Chocolates: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూతురికి మోదీ చాక్లెట్లు...

Modi chocolates to MP Ram Mohan Naidu's Daughter: పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మార్చి 14న ప్రారంభమైన రెండో విడత సమావేశాలు ఈ నెల 8తో ముగియనున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీలంతా ఢిల్లీలో ఉన్నారు. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన సతీమణి, కూతురితో కలిసి ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడు కూతురికి చాక్లెట్లు ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఇదిలా ఉంటే, మంగళవారం (ఏప్రిల్ 5) ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. 

బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మోదీ ఎంపీలకు సూచించారు. ఆయా వర్గాల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను వారికి సవివరంగా తెలియజేయాలన్నారు. ఎంపీలంతా ప్రజా సేవకు అంకితం కావాలన్నారు. ఇదే సమావేశంలో జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. ఇటీవలి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినందుకు నడ్డాను అభినందించారు. 

Trending News