గల్లీ నుంచి ఢిల్లీ వరకు పయనం; జైపాల్ రెడ్డి ప్రస్థానం ఇదే..

తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి ఈ రోజు తుదిశ్వాస విడచి...మనకు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Last Updated : Jul 28, 2019, 02:12 PM IST
గల్లీ నుంచి ఢిల్లీ వరకు పయనం; జైపాల్ రెడ్డి ప్రస్థానం ఇదే..

తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో జన్మించి ఢిల్లీ స్థాయిలో ప్రభావితం చేయగల నేతగా ఎదిగిన జైపాల్ రెడ్డి మరణం రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజానికం వరకు..ఇలా అందరినీ దిగ్భాంత్రికి గురి చేసింది. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు. గల్లి నంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆయన ప్రస్తానం గురించి ఒక్కసారి తెలుసుకుందాం..

జైపాల్ సుదీర్ఘ  ప్రస్తానం ఇదే...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగులలో 1942, జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. ఆయనకు కుటుంబం విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందారు.  పత్రికలు విపరీతంగా చదివే అలవాటు ఉన్న ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాలను అవగాహన చేసుకున్నారు. 
విద్యార్ధి దశ నుంచి పోరాటాలు..
విద్యార్ధి దశలో ఉండగానే ఎన్నో సమస్యలపై పోరాడిన జైపాల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మొదట  రాజగోపాలచారికి ఆకర్షితుడైన జైపాల్ రెడ్డి.. తర్వాత నెహ్రూ విధానాల వైపు మొగ్గు చూపారు. 23 ఏళ్లకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడయ్యారు. 26 సంవత్సరాలకు ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్‌పార్టీకి రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా సేవలందించాను. 

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన జైపాల్..
అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి 1977లో జనతాపార్టీలో చేరారు. తదనంతర పరిణామాల వల్ల పార్టీలో వివాదాలు సర్ధుమణగడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చిన  జైపాల్..పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు.అధికారంలోకి వచ్చిన తర్వాత  కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇలా తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన జైపాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ  ఇలా దేశంలోని ముఖ్య నేతల్లో ఒకరిగా నిలిచారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర 
దేశ రాజకీయాల్లో బీజీగా ఉన్నప్పటికీ జైపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. తొలి దశలో సమైక్యవాదిగా ముద్రపడ్డ జైపాల్ రెడ్డి.. ఉద్యమ తీవ్రతను చూసి తెలంగాణ వాదిగా మారారు. మలిదశ ఉద్యమం సమయంలో ప్రజా క్షేత్రంలోకి రాకపోయినా...తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో హైకమాండ్ ను ప్రభావితం చేయగలిగారు. ఇలా దేశ ప్రయోజనాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తిగా పనిచేశారు జైపాల్. తుది శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా వాణిగ వినిపించారు.  కాంగ్రెస్ వాదిగా ప్రారంభమైన ఆయన జీవిత పయనం... చివరకు కాంగ్రెస్ వాదిగానే కన్నుమూశారు.

అసంతృప్తి లేని రాజకీయ జీవి జైపాల్ !! 

రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ దశలోనూ జైపాల్ అసంతృప్తికి గురైంది లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా యాబై ఏళ్ల రాజకీయం జీవితంలో ఏం కోరుకోలేదు.పదవులను ఏనాడు ఆశించలేదు..పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. జఠిలమైన సమస్యలకు తన మాటలతో కాకుండా చేతలతో పరిష్కారం చూపే మేధస్సు ఆయన సొంతం. ఇలా ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన ఆయన్ను పార్టీ హైమాండే ఏరి కోరి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలా జైపాల్ రెడ్డి రాజకీయంగా పరిపూర్ణమైన సంతృప్తి కరమైన జీవితాన్ని గడిపారు. 

జైపాల్ అందరి వాడు...
కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఎదిగిన సీనీయర్ నేత, తెలంగాణ ముద్దు బిడ్డ జైపాల్‌రెడ్డిని..సొంత పార్టీ నేతలతో పాటు అన్ని పార్టీల్లోని నేతలు అభిమానిస్తారు. దానికి కారణం లేకపోలేదు... స్వభావ రీత్యా సౌమ్యుడైన జైపాల్ రెడ్డి... వివాదాల  కంటే సమస్య పరిష్కారానికే పెద్దపీట వేస్తారు. రాజకీయలకు అతీతంగా అందరినీ గౌరవించే తత్వం ఆయన సొంతం. సమస్య పరిస్కారం విషయంలో చిత్తుశుత్తితో పనిచేసే మంచి వ్యక్తిత్వం ఆయనది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం వల్లే రాజకీయలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారు ..అభిమానిస్తారు. ఈ రోజు ఆయన మరణంపై అందరూ దిగ్భాంత్రి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

 

Trending News