AP Municipal Election Results: అక్కడ మాత్రం ఖాతా తెరిచిన ప్రతిపక్ష Telugu Desam Party

AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్‌సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 14, 2021, 02:48 PM IST
  • ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తోంది
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ పార్టీ వైఎస్సార్‌సీపీ మరింత ప్రభంజనం
  • అనూహ్యంగా కడప జిల్లాలోనూ ఓ మున్సిపాలిటీలో టీడీపీ సగం వార్డులు గెలుచుకుంది
AP Municipal Election Results: అక్కడ మాత్రం ఖాతా తెరిచిన ప్రతిపక్ష Telugu Desam Party

Tadipatri Municipal Election Results 2021: ఏపీలో జరుగుతున్న పురపాలక, నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్‌సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్‌సీపీ మరింత ప్రభంజనం సృష్టిస్తోంది.

కొన్ని చోట్ల మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపాలిటీ ఫలితాలలో ఎట్టకేలకు టీడీపీ ఖాతా తెరిచింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో(AP Municipal Election Results 2021) ఆ పార్టీ బోణీ కొట్టింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా, 19 వార్డులు టీడీపీ, 1 వార్డులు వైకాపా, 2 వార్డులలో సీపీఐ విజయం సాధించాయి. అనూహ్యంగా కడప జిల్లాలోనూ ఓ మున్సిపాలిటీలో టీడీపీ సగం వార్డులు గెలుచుకుంది. మైదుకూరులో మొత్తం 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డులు, వైఎస్సార్‌సీపీ 11 వార్డులు, పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన ఒక వార్డును కైవసం చేసుకుంది.

Also Read: YSRCP: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ హవా.. క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోన్న వైఎస్సార్‌సీపీ

రాజధాని ప్రాంతాల్లోని జిల్లాల్లోనూ అధికార వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కడుతున్నారు. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. టీడీపీ మేయర్‌ అభ్యర్ధి కేశినేని శ్వేత విజయం సాధించారు. టీడీపీ ఐదు, వైసీపీ ఐదు డివిజన్లలో విజయం సాధించగా లెక్కింపు కొనసాగుతోంది. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి  విజయం సాధించారు.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయితీలు ఉన్నాయి. వీటితో కొన్ని ఏకగ్రీవం కాగా, మిగతా స్థానాలకు మార్చి 10న ఎన్నికలు నిర్వహించగా, నేటి ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ఉద్యం, రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసనలు, మూడు రాజధానుల వివాదం కొనసాగుతున్నా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఓటర్లు మరోసారి మంచి మార్కులు వేశారు.
Also Read: Ap Municipal Elections results: మూడు రాజధానులకే ప్రజా మద్దతు, మున్సిపల్ ఫలితాలే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News